న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైరల్ అవుతోన్న ధోనీ-రాహుల్‌ల వీడియో

MS Dhoni impressed by KL Rahul’s century celebration

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టీ20లో ఇండియా ఘన విజయం సాధించింది. అటు బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ సత్తా చాటిన ఇండియన్ క్రికెటర్లు ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ విజయం సాధించి శుభారంభాన్ని ఇచ్చారు. మ్యాచ్ మొత్తంలో బౌలింగ్‌లో కుల్దీప్ 5 వికెట్లు పడగొట్టగా, రాహుల్ సెంచరీ పూర్తి చేసి భారత్ స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ధోనీ ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

దీంతో.. సామాజిక మాధ్యమాల్లో భారత క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌-మహేంద్ర సింగ్‌ ధోనీకి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ధోనీ రియాక్షన్‌ చూసి అయితే అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా మంగళవారం ఆతిథ్య జట్టుతో భారత్‌ తొలి టీ20 ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుల్‌దీప్‌ యాదవ్‌, కేఎల్ రాహుల్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు‌.

1
42368

భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ వీర బాదుడు బాదాడు. ఫోర్లు, సిక్స్‌లతో ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. ఈ క్రమంలోనే 18వ ఓవర్లో శతకం పూర్తి చేశాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మైదానంలో పరిగెత్తుతూ, గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకున్నాడు. డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉన్న సహచర ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ రాహుల్‌ను అభినందించారు. రాహుల్‌ సంబరాలను చూసి ధోనీ చప్పట్లు కొడుతూ ఒక రియాక్షన్‌ ఇచ్చి డ్రస్సింగ్‌ రూమ్‌ లోపలికి వెళ్లాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 'ధోనీ రియాక్షన్‌కు వెల కట్టలేం' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నాడు. అలాగే శతకం సాధించిన సమయంలో రాహుల్‌ కాస్త భావోద్వేగానికి కూడా గురయ్యాడు. టోర్నీలో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం జరగనుంది.

Story first published: Tuesday, July 17, 2018, 16:52 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X