For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ క్రికెట్‌లో ధోని ప్రభావం!

మహేంద్ర సింగ్ ధోని.. పరిచయం అక్కర్లేని పేరు. ఎంఎస్ ధోని కేవలం భారత్‌కే కాదు.. దేశాల హద్దులు దాటి మరెందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన దిగ్గజం. రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి ప్రపంచ క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నాయకుడిగా ఎదిగిన ఎంఎస్ ధోని పోరాటం.. ఓ పాకిస్తానీ క్రికెటర్ జీవితాన్ని మలుపు తిప్పింది. దుబాయ్ లాంటి విదేశీ గడ్డపై స్థిరపడిన జీవితాన్ని, సేల్స్‌మ్యాన్ ఉద్యోగాన్ని వదులుకుని.. రిటైర్మెంట్ వయస్సులో మళ్లీ తన కల కోసం పోరాడే ధైర్యాన్నిచ్చింది కేవలం ధోని ఆడిన క్రికెట్ కాదు.. 'MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా! ఆటను వదిలేసిన ఒక ఆటగాడికి, తిరిగి అంతర్జాతీయ వేదికపైకి అడుగు పెట్టడానికి ప్రేరణనిచ్చిన ధోని ప్రభావం ఎంత గొప్పదో తెలుసుకుందాం!

దుబాయ్‌లో సేల్స్‌మ్యాన్‌గా స్థిరపడిన జీవితాన్ని వదిలి, దేశం తరపున ఆడే కలను నెరవేర్చుకోవడానికి తిరిగి వచ్చాడు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బయోపిక్ చూసిన తర్వాత అతనిలో నిండిన అసాధారణమైన ఉత్సాహమే ఇందుకు కారణం. క్రికెట్‌ను వదిలేసి, రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్నా... తిరిగి బ్యాట్/బాల్ పట్టుకొని, కరేబియన్ లీగ్‌లో సత్తా చాటి, చివరికి పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ 27 ఏళ్ల ఆటగాడి పోరాట గాథ ప్రతి క్రీడాకారుడికి ఒక స్ఫూర్తిదాయకం!

MS Dhoni Impact on Pakistan Cricket Usman Tariq Inspiring Comeback Story

దుబాయ్ ఉద్యోగాన్ని వదిలేసి..
27 ఏళ్ల ఉస్మాన్ తారిక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. నవంబర్ 1, 2025న కరాచీలో దక్షిణాఫ్రికాపై టీ20 మ్యాచ్ ఆడిన ఉస్మాన్ తారిక్.. క్రికెట్లోకి తాను రావడానికి ధోని బయోపిక్ ప్రేరణగా నిలిచిందని ఆయన చెప్పాడు. ఆట నుంచి దూరమైన తర్వాత తనలో మళ్లీ క్రికెట్ పట్ల మక్కువను పెంచింది ఆ సినిమానే అని తెలిపాడు. ఉస్మాన్ తారిక్ మాట్లాడుతూ.. "నేను జట్టులో ఎంపిక కానందున ఆటను వదిలివేశాను. దుబాయ్‌లోని ఒక కంపెనీలో సేల్స్ మ్యాన్‌గా పని చేస్తున్నాను. అక్కడ నేను 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' చూశాను. అది నాకు చాలా ప్రేరణనిచ్చింది. నేను నా ఉద్యోగాన్ని వదిలేసి క్రికెట్‌ను మళ్లీ కొనసాగించడానికి పాకిస్తాన్‌కు తిరిగి వచ్చాను" అని ఉస్మాన్ తారిక్ వివరించాడు.

ఫలించిన పోరాటం
మహేంద్ర సింగ్ ధోని రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేసేవారు. పని, ఆట మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఆయన క్రికెట్‌ను తన మొదటి ప్రాధాన్యతగా చేసుకున్నారు. ధోని ఎంతో శ్రమించి, లీగ్‌లలో ఆడి చివరికి భారత జట్టులో స్థానం సంపాదించారు. ఉస్మాన్ తారిక్ కథ కూడా దాదాపు అలాంటిదే. దుబాయ్ ఉద్యోగం వదిలి క్రికెట్ వైపు వచ్చిన ఉస్మాన్ తారిక్ అనుకున్నది సాధించాడు. ఉస్మాన్ తారిక్ 2025 కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL)లో 20 వికెట్లు తీశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడంలో విజయం సాధించాడు.

Story first published: Tuesday, November 25, 2025, 11:12 [IST]
Other articles published on Nov 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+