Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కూడా సెలక్టర్ల బాధితుడే: సెహ్వాగ్ సంచలనం

మొహాలి: ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్టులో సెలక్టర్లు విరాట్ కోహ్లీని తప్పించడానికి చూస్తే ధోనితో కలిసి తాను అడ్డుకున్నానని టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌లో టీవీ కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్న సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

2012లో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో కోహ్లీని తప్పించి అతడి స్ధానంలో రోహిత్ శర్మను తీసుకోవాలని సెలక్టర్లు భావించారని అయితే ఆ నిర్ణయాన్ని ధోని, తాను వ్యతిరేకించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. అప్పట్లో టెస్టు కెప్టెన్‌గా ధోని ఉన్నాడని, తాను వైస్ కెప్టెన్‌గా ఉన్నట్లు సెహ్వాగ్ చెప్పాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ టీవీ కామెంటేటర్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొహాలి వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో సెహ్వాగ్ తనదైన శైలిలో కామెంటేటరీ చెప్తున్నాడు. ఈ క్రమంలో ఈ విషయాన్ని సెహ్వాగ్ వెల్లడించాడు.

MS Dhoni and I stopped selectors from dropping Virat Kohli, reveals Virender Sehwag

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా మెల్ బోర్న్‌లో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ 11, 0 పరుగులు చేశాడు. ఆ తర్వాత సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో కూడా 23, 9 పరుగులతో కోహ్లీ విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు మూడో టెస్టుకు కోహ్లీని తప్పించి అతడి స్ధానంలో రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకోవాలని అనుకున్నారు.

అయితే సెలక్టర్ల నిర్ణయాన్ని కెప్టెన్ ధోని, వైస్ కెప్టెన్ సెహ్వాగ్ వ్యతిరేకించారు. ఇక పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ 44, 75 పరుగులతో కాస్తంత ఫరవాలేదనిపించాడు. అడిలైడ్‌లో జరిగిన చివరి టెస్టులో కోహ్లీ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులతో సెంచరీని సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులతో రాణించాడు.

ఆ సిరిస్ మొత్తంలో సెంచరీ సాధించిన ఏకైక ఇండియన్ బ్యాట్స్ మెన్ కోహ్లీనే. 2012లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ పూర్తిగా విఫలమైంది. ఈ సిరిస్‌ను 4-0తో భారత్ కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో వీరేంద్ర సెహ్వాగ్ చెప్తున్న హిందీ కామెంటేటరీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

అంతేకాదు కామెంటరీలో భాగంగా సెహ్వాగ్ వేస్తోన్న ఛలోక్తలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సెహ్వాగ్ ట్విట్టర్‌లో అద్భుతమైన ట్వీట్స్‌తో రెచ్చిపోతున్నాడు. ఇక 28 ఏళ్ల కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్లలో ఒకడిగా నిలిచాడు.

ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం మొహాలిలో పదోవ టెస్టు ఆడుతున్న కోహ్లీ ఈ ఏడాది అన్ని ఫార్మట్లలో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 84.33 యావరేజితో మొత్తం 2,277 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ ఏడాది ఇప్పటి వరకు 9 టెస్టులాడి 69 యావరేజితో 897 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+