
ఒకే రోజు డబుల్ గేమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మిగిలిన జట్ల మాట ఎలా ఉన్నప్పటికీ.. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు మాత్రం చిట్టచివరి లీగ్ మ్యాచ్ లైఫ్ అండ్ డెత్ లాంటిదే. ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ అది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడితే మాత్రం ఇంటి దారి పట్టక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది రోహిత్ సేన.

ప్లేఆఫ్స్ ఖాయం..
మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టోర్నమెంట్లపై ఎప్పట్లాగే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం 18 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉందా టీమ్. చివరి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైనప్పటికీ.. ప్లేఆఫ్స్ అవకాశాలను ఏ మాత్రం దెబ్బతీయలేదు. ఇప్పటికే ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. లీగ్ దశలో తన చిట్టచివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొనబోతోంది ధోనీ సేన. ఈ మ్యాచ్ గురువారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది.

ధోనీ మీదే ఫోకస్
ఈ నెల 15వ తేదీన ఇదే దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ముగుస్తుంది. ఇక మళ్లీ ఐపీఎల్ కోసం వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అందరి కళ్లూ ఎంఎస్ ధోని మీదే నిలిచాయి. నెక్స్ట్ సీజన్ నాటికి అతను అందుబాటులో ఉంటాడా? లేడా? అనే విషయంపై ఇదివరకే డిబేట్స్ సాగాయి. వయసు మల్లడం వల్ల ధోని ఇక ఐపీఎల్ 2022 నాటికి రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడనే అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఐపీఎల్ 2022లో
వాటన్నింటినీ పటాపంచలు చేశాడు తలైవా. 2022 సీజన్‌లో ఆడబోతున్నాననే హింట్ ఇచ్చాడు. నేరుగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తన ఫేర్‌వెల్ మ్యాచ్ ఎమిరేట్స్ గడ్డ మీద ఉండబోదని స్పష్టం చేశాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో వీడ్కోలు మ్యాచ్‌ను ఆడతానని ప్రామిస్ చేశాడు. తోటి ప్లేయర్లు దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, శార్దుల్ ఠాకూర్‌లతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ యూట్యూబ్ పేజ్‌లో అభిమానులతో ఇంటారాక్ట్ అయ్యాడు ధోనీ.

చెపాక్‌లో ఫేర్‌వెల్ మ్యాచ్..
ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించడానికి ఆగస్టు 15వ తేదీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోనీ సమాధానం ఇచ్చాడు. ఫేర్‌వెల్ మ్యాచ్‌లో చూడాలని అనుకుంటున్నామంటూ అతను చేసిన రిక్వెస్ట్‌కు సానుకూలంగా స్పందించాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో ఖచ్చితంగా తన ఫేర్‌వెల్ మ్యాచ్ ఉంటుందని హామీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ ఇప్పటికే వైదొలగాడు. ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.

ఇట్స్ ప్రామిస్..
క్రికెట్ ఆడటానికి అతనికి అందుబాటులో ఉన్న డయాస్ ఇదొక్కటే. చెపాక్ స్టేడియంలో ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడతాననే భరోసా ఇవ్వడానికి కారణం- ఐపీఎల్. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడే అవకాశం ఉండటం వల్లే ధోనీ.. తన అభిమానికి ఈ ప్రామిస్ చేసినట్టయింది. తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించడానికి అంతకంటే మంచి తేదీ దొరకదని భావించానని ధోనీ చెప్పుకొచ్చాడు. తన ఫేర్‌వెల్ మ్యాచ్ చెపాక్‌లో ఉంటుందని స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications












