Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: రిటైర్మెంట్‌‌పై హింట్ ఇచ్చిన కెప్టెన్ కూల్!

MS Dhoni: ఐపీఎల్ 2025లో భాగంగా 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి మౌనాన్ని వీడాడు. ధోని చెప్పిన విషయం తన ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలను మరింత పెంచింది.

రిటైర్మెంట్‌పై మౌనాన్ని వీడిన ఎంఎస్ ధోని
బుధవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ కు ముందు టాస్ సందర్భం ధోని హాస్యాస్పదంగా స్పందించాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ ధోనిని తదుపరి ఐపీఎల్ సీజన్‌లో వస్తారా అని అడిగాడు.సమయంలో ఎంఎస్ ధోని నవ్వుతూ.. బహుశా నేను తదుపరి ఐపీఎల్ ఆడకపోవచ్చు అని అన్నాడు. తాను తదుపరి మ్యాచ్ ఆడతానో లేదో కూడా తెలియదని మహీ నవ్వూతూ బదులిచ్చాడు. ఐపీఎల్ టాస్ ప్రెజెంటర్ డానీ మోరిసన్ ధోనిని ఉద్దేశించి.. ఇక్కడ(స్టేడియం) అభిమానుల ఉత్సాహాన్ని చూడు అని అడిగాడు.

MS Dhoni Hints at Retirement After IPL 2025

ఎంఎస్ ధోని సమాధానం అభిమానులను మళ్లీ ఊహించుకునేలా చేసింది. ఈ క్రమంలో ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రైటైర్మెంట్ అవుతారా అనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. 2020లో ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అప్పటి నుంచి ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ధోని ఇంకా ఆడుతున్నాడు. ప్రతి సీజన్ ధోని చివరి సీజన్ అని చెబుతారు కానీ 43 ఏళ్ల ధోని ఇప్పటికీ సీఎస్కేకు కెప్టెన్ గా ఉన్నాడు.

పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో సీఎస్కే
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఆ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎంఎస్ ధోని చివరి స్థానంలో ఉన్నాడు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మొత్తం సీజన్ కు దూరంగా ఉన్నాడు. రుతురాజ్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఎంఎస్ ధోని కెప్టెన్ అయిన తర్వాత కూడా జట్టు ప్రదర్శనలో గణనీయమైన మార్పు ఏమీ రాలేదు.

Story first published: Wednesday, April 30, 2025, 21:04 [IST]
Other articles published on Apr 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+