రాబోయే రెండేళ్లలో చెన్నై జట్టులో పెను మార్పులు.. ధోనీ రిటైర్‌మెంటే కారణమా??
హైదరాబాద్: రాబోయే రెండేళ్ల కాలంలో చెన్నై జట్టులో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయని జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వెల్లడించాడు. ఎంతటి ఫామ్‌లో ఉన్నా వాళ్లు వయస్సు రీత్యా టీ20 ఫార్మాట్‌కు సరిపోరనే ఉద్దేశ్యంతో ఇలా భావిస్తున్నట్లు తెలిపాడు. జట్టును ఎంతో విజయవంతంగా నడిపిస్తోన్న ధోనీ ఇప్పటివరకూ జరిగిన 10 సీజన్లలో 8 సీజన్లకు చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుత సీజన్‌ను సైతం అదే పంథాలో కొనసాగిస్తోన్న ధోనీ ఇటీవల మీడియాతో ముచ్చటిస్తూ ఇలా పేర్కొన్నాడు.

సామీప్యత ఉన్న వాళ్లందరినీ
'యాజమాన్యం చాలా తెలివిగా వ్యవహరించింది. దాదాపు సామీప్యత ఉన్న వాళ్లందరినీ ఒక చోటకి చేర్చింది. వాళ్లంతా వ్యక్తిగతంగా జట్టుకు ఏం కావాలో ఎంత వరకూ చేయాలో తెలిసిన వాళ్లు కావడంతో కెప్టెన్ పనిని సులభతరమైపోతోంది. నాయకుడే కాదు. మంచి జట్టు లేకపోయినా ఆడడమనేది కష్టంగా ఉంటుంది. అందుకే మంచి ఆటగాళ్లను ఎంచుకుంటున్నాం. వాళ్లు మంచి ప్రదర్శన ఇస్తున్నారు.' అని అన్నాడు.

మరో రెండేళ్లలో జట్టులో పెను మార్పులు
ఇంకా మాట్లాడుతూ.. 'మరో రెండేళ్లలో జట్టులో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు చాలా మంది షార్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిపోతున్నారు.' అని వెల్లడించాడు. ఐపీఎల్‌లో భాగంగా జరిగిన 11సీజన్లలో 8 పూర్తి చేసుకుని 9వ సీజన్‌లో ఆడుతోంది. రెండేళ్ల నిషేదం అనంతరం పునరాగమనం చేసిన చెన్నై దూకుడుతో దూసుకుపోతోంది. ఆరంభం నుంచి పడిలేస్తూ.. ఫైనల్‌కు చేరింది.

విజయంలో డుప్లెసిస్ కీలక పాత్ర
మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్లేఆఫ్ రేసులో చెన్నై, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139పరుగులు చేసింది. చేధనకు దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంలో డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు.

దుమ్మురేపిన డుప్లెసిస్:
సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన ఆ వీరుడు ఫాఫ్ డుప్లెసిస్. వాట్సన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు మరోవైపు నుంచి వేగంగా వికెట్లు పోతున్నా.. స్పిన్, పేస్‌తో హైదరాబాద్ బౌలర్లు తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నా మొక్కవోని పట్టుదలతో నిలిచాడు. చివరి మూడు ఓవర్లలో సీఎస్‌కే విజయానికి 43 పరుగులు అవసరమైన తరుణంలో డుప్లెసిస్ రెచ్చిపోయాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కొట్టాల్సిన స్కోరును తగ్గించుకుంటూ వచ్చాడు. ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా, డుప్లెసిస్ తొలి బంతినే సిక్స్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications