For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రౌండ్ బాటమ్ బ్యాట్ - హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌కు ధోనీ టీ20 చిట్కా..!!

MS Dhoni has suggested Hardik Pandya and Rishabh Pant to try round-bottomed bats in T20s

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను చిత్తు చేసింది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఇక తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతోంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఈ రెండు జట్లు గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. పెర్త్ స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్ కోసం టీమ్ మొత్తం పెర్త్‌కు చేరుకుంది కూడా. అక్కడే నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. తొలుత పాకిస్తాన్, అనంతరం నెదర్లాండ్స్‌ను ఓడించిన భారత్ ఇప్పుడిక దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. టీమిండియాతో సమవుజ్జీగా ఉన్న జట్టు కావడం వల్ల ఈ మ్యాచ్‌‌లో పోరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.

ఈ టోర్నమెంట్‌లో హార్దిక్ పాండ్యా ఆటతీరు అంచనాలకు అనుగుణంగా ఉంటోంది. పాకిస్తాన్‌పై 40 పరుగులు చేశాడీ ఆల్‌రౌండర్. మరో ఎండ్‌లో రెచ్చిపోయి ఆడుతోన్న కేప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలిచాడు. చివరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అటు బంతితోనూ రాణించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. నెదర్లాండ్స్‌పై బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఒక్క ఓవరే బౌల్ చేశాడు.

అటు రిషభ్ పంత్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. ఇంకా అరంగేట్రం చేయలేదతను. భారత్ ఆడిన రెండింట్లోనూ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. హార్దిక్ పాండ్యా నిలకడగా రాణించడానికి టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇచ్చిన చిట్కాలే కారణం. టీ20 ప్రపంచకప్ ఆరంభం కావడానికి ముందే పాండ్యా, పంత్ ఇద్దరూ ఎంఎస్ ధోనీని సంప్రదించినట్లు ప్రముఖ స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ సన్స్‌పారీల్స్ గ్రీన్‌ల్యాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్ తెలిపారు.

టీ20 మ్యాచ్‌లల్లో పవర్ హిట్టింగ్ కోసం రౌండ్ బాటమ్ గల బ్యాట్లను వినియోగించాలని ధోనీ వారిద్దరికీ సూచించాడు. ఈ సూచనలకు అనుగుణంగా హార్దక్ పాండ్యా, రిషభ్ పంత్ తాము వినియోగించే బ్యాట్‌లో మార్పులు చేర్పులు చేశారని, ఇప్పుడదే బ్యాట్‌ను టీ20 ప్రపంచకప్‌లో వాడుతున్నాడని చెప్పారు. ఇదివరకు టీ20 ఇంటర్నేషనల్స్‌లల్లో ధోనీ ఎలాంటి బ్యాట్లను వినియోగించేవాడో సేమ్ టు సేమ్ అలాంటి రౌండ్ బాటమ్ బ్యాట్లను తాము తయారు చేసి ఇచ్చినట్లు పరాస్ ఆనంద్ పేర్కొన్నారు.

ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ తొలిసారిగా ఇలాంటి బ్యాట్లను వినియోగించాడని, ఆ తరువాత మిగిలిన వారు దాన్ని అనుసరించినట్లు చెప్పారు. పొట్టి ఫార్మట్‌లో ఫ్లాట్ బాటమ్ ఉన్న బ్యాట్ల కంటే కూడా పవర్ హిట్టింగ్ కోసం రౌండ్ బాటమ్ బ్యాట్స్ ఉపయోగడపతాయని, బ్యాటర్ తన క్రీజ్‌లో తన స్టాండ్స్‌ను మార్చుకోవడంలో సహకరిస్తుందని పరాస్ ఆనంద్ అన్నారు.

Story first published: Saturday, October 29, 2022, 11:17 [IST]
Other articles published on Oct 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+