Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, సెలక్టర్లకు ధోనీ సమాచారం ఇచ్చే ఉంటాడు: గంగూలీ

MS Dhoni has had communication with captain, selectors on his future says Sourav Ganguly

న్యూఢిల్లీ: తన భవిష్యత్‌ ప్రణాళికలపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సెలెక్టర్లతో మాట్లాడి సమాచారం ఇచ్చే ఉంటాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డారు. మహీ భారత క్రికెట్లో తిరుగులేని విజేత. వెంటనే మరో ధోనీ మనకు దొరకడు అని దాదా అన్నారు. శనివారం ఇండియాటుడే నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దాదా మాట్లాడారు.

ధోనీ వారికి చెప్పే ఉంటాడు:

ధోనీ వారికి చెప్పే ఉంటాడు:

టీమిండియా కెప్టెన్‌, బీసీసీఐ సెలక్టర్లతో మహీ మాట్లాడే ఉంటాడు. ఆ వివరాలు చర్చించేందుకు ఇది సరైన వేదిక కాదు. మహీ ఏం చేయాలని అనుకుంటున్నాడో అది అతని ఇష్టం. నాకు మాత్రం తెలియదు. ఎందుకంటే నేను అతడితో ఇంకా మాట్లాడలేదు. కానీ.. భారత క్రికెట్లో అతడో తిరుగులేని విజేత. వెంటనే మరో ధోనీ మనకు దొరకడు. ఆడాలనుకున్నా, వద్దనుకున్నా అది మహీ ఇష్టం' అని గంగూలీ అన్నారు. ఈ ఏడాది జూలైలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ తర్వాత క్రికెట్‌ నుంచి ధోనీ నిరవధిక విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే.

 సెమీస్‌ దశ దాటాలి

సెమీస్‌ దశ దాటాలి

2015, 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరిగడంపై దాదా స్పందించారు. 'ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. కోహ్లీ, రవిశాస్త్రితో మాట్లాడతాను. ఇది మానసిక అవరోధమైనా మరొకటైనా ఆటగాళ్లు దానిని అధిగమించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పటిష్ఠ జట్టు ఉంది. కానీ సెమీస్‌ దశ దాటాలి. ఈ ప్రపంచకప్‌లో బాగా ఆడారు కానీ.. న్యూజిలాండ్‌ చేతిలో ఓడారు. ఎదో ఒకటి చేయాలి' అని దాదా పేర్కొన్నారు.

కోహ్లీతో వ్యక్తిగతంగా మాట్లాడతా

కోహ్లీతో వ్యక్తిగతంగా మాట్లాడతా

'ఆటగాళ్లకు సామర్థ్యం ఉందని నా నమ్మకం. టీ20 క్రికెట్లో స్వేచ్ఛ అవసరం. ఒక బ్యాటింగ్‌ విభాగంగా లక్ష్యాన్ని బాగానే ఛేదిస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడే కొన్నిసార్లు తడబడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. బయట నుంచి మరికొన్ని స్వీకరిస్తాను. కోహ్లీతో వ్యక్తిగతంగా మాట్లాడతాను' అని గంగూలీ తెలిపారు.

టీమిండియాకు పెద్ద సవాలే అదే

టీమిండియాకు పెద్ద సవాలే అదే

'ఆస్ట్రేలియా గడ్డపై 2020 టెస్టు సిరీస్‌లో ఆ జట్టును ఓడించడం టీమిండియాకు పెద్ద సవాలే. వారి దేశంలో ఆస్ట్రేలియాను ఓడించగల పూర్తి సామర్థ్యం కోహ్లీసేనకు ఉంది. 2018లో సిరీస్‌ గెలిచినప్పుడు ఆసీస్‌లో ప్రధానమైన ప్లేయర్లు (స్మిత్‌, వార్నర్‌) లేరన్న విషయం కోహ్లీకి తెలుసు. కానీ.. ఇప్పుడు ఆ జట్టు పూర్తి సామర్థ్యంతో ఉంది. అందుకే అప్పటి కంటే వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరిగే సిరీస్‌ టీమిండియాకు పెద్ద సవాల్‌' అని దాదా చెప్పుకొచ్చారు.

Story first published: Sunday, December 29, 2019, 12:34 [IST]
Other articles published on Dec 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+