For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ.. కొత్తగా ఏమీ చెయ్యట్లేదు.. గతాన్ని గుర్తు చేస్తున్నాడంతే!!

MS Dhoni Has Gone Back To His Incredible Consistent Best, Says Gary Kirsten

హైదరాబాద్: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం టీమిండియాకు కెప్టెన్సీ వహించిన మహేంద్ర సింగ్ ధోనీ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్నాడు. ఆ సమయంలో భారత జట్టుకు కోచ్‌గా విధులు నిర్వర్తించిన దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టన్ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. ఆ చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఇండియా.. ఇండియా అంటూ హర్షధ్వానాలు చేశాడు.

భారతీయ ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చిన విదేశీ కోచ్‌లలో గ్యారీ కిర్‌స్టన్ ప్రథముడు. ఈ సందర్భంగా ప్రముఖ ఇంగ్లీషు మీడియాతో కిర్‌స్టన్ ముచ్చటించాడు.


ప్రశ్న: 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు మీరు టీమిండియాకే శిక్షణ ఇచ్చారు కదా. అది గెలిచిన తర్వాత మీకెలా అనిపించింది.?

జవాబు: ఆ పరిస్థితుల్లో జట్టులో ఒక కుటుంబ వాతావరణం నెలకొంది. జ్ఞాపకాలైతే ఒకట్రెండు కాదు. చాలానే ఉన్నాయి.


ప్రశ్న: ధోనీ ఫామ్‌ను పునరావృతం చేస్తున్నాడా.? అతనిలో మార్పు ఏమైనా గమనించారా?

జవాబు: అతనిలో మార్పు ఏమీ లేదు. ఫామ్ పునరావృతం కాదు. అతనేంటో గతాన్ని గుర్తు చేస్తున్నాడంతే.


ప్రశ్న: 2011 తర్వాత మళ్లీ ధోనీ 2019 ప్రపంచ కప్‌ను కూడా గెలిచేందుకు అవకాశాలున్నాయంటారా?

జవాబు: కేవలం ఇండియా ఒక్కటే కాదు. ఈ సారి ప్రపంచ కప్ గెలుచుకునేందుకు చాలా దేశాల జట్లకు అవకాశాలున్నాయి. ఈ సారి టోర్నమెంట్ అత్యంత ఆసక్తిగా మారనుంది.


ప్రశ్న: స్మిత్, వార్నర్ లేని ఆస్ట్రేలియా జట్టును టీమిండియా సునాయాసంగా గెలుస్తుందనుకుంటున్నారా?

జవాబు: ఇది చాలా క్లిష్టమైన మ్యాచ్. దాని కోసం నేనూ ఆతురతగా ఎదురుచూస్తున్నా..


ప్రశ్న: కౌంటీ క్రికెట్ విరాట్ కోహ్లికి ఏ విధంగా ప్రయోజనం చేకూర్చనుంది.?

జవాబు: చివరి సమయం వరకూ ఆటగాళ్ల ఏం చేయగలరనేది అంచనా వేయలేం. నిజానికి అతను అద్భుతమైన ప్రదర్శన చేయగల ఆటగాడు.


ప్రశ్న: ఐపీఎల్ 11లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోచింగ్ అనుభవం ఎలా ఉంది?

జవాబు: చక్కటి వాతావరణం మధ్య ప్రతి నిమిషం ఎంజాయ్ చేశాం.


ప్రశ్న: ఇప్పటి వరకూ ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు శిక్షణ ఇచ్చారు. భారత ఆటగాళ్ల ప్రతిభ గురించి ఏం గమనించారు?

జవాబు: ఇండియాలో అత్యద్భుతమైన ఆటగాళ్లున్నారు. వాళ్లను చూసి చాలా సార్లు ఉత్తేజానికి గురైయ్యాను. అసలు ఐపీఎల్ అంటే అలానే కదా ఉండాలి. చాలా మంది వరకూ ఆటగాళ్లు ఐపీఎల్‌ను ఎదిగేందుకు మంచి ప్లాట్ ఫామ్‌గా భావిస్తున్నారు. ఇదొక మంచి పరిణామం.

Story first published: Thursday, May 10, 2018, 17:13 [IST]
Other articles published on May 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+