షూలేస్ కూడా కట్టుకోవడం సరిగా రానివారు ధోనీని విమర్శిస్తున్నారు: రవిశాస్త్రి

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు నచ్చినప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే హక్కుని సంపాదించాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు భారత జట్లను ఎంపిక చేసేందుకు గాను ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశమైన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తు గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు జట్టు ఎంపికకు ముందే ధోనీతో మాట్లాడామని ఎమ్మెస్కే తెలిపాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలన్న ఆలోచనలకు ధోని సైతం మద్దతు తెలిపాడని అన్నాడు.
రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం ధోనీదేనని... మేం పూర్తిగా భవిష్యత్తుపై దృష్టి పెట్టామని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు రిషబ్ పంత్‌తో పాటు యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ మరోసారి తెరపైకి వచ్చింది.

ధోనీని తన ఫేర్‌వెల్ సిరిస్‌కే
ధోనీని తన ఫేర్‌వెల్ సిరిస్‌కే సెలక్టర్లు ఎంపిక చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ధోని భవితవ్యంపై చర్చించే వారిపై రవిశాస్త్రి మండిపడ్డాడు. రవిసాస్త్రి మాట్లాడుతూ "ధోనీ రిటైర్మెంట్‌పై మాట్లాడే వారిలో సగం మందికి షూలేస్ కూడా కట్టుకోవడం సరిగా రాదు. అతను దేశం కోసం ఏమి సాధించాడో చూడండి" అని రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

క్రికెట్‌కు గుడ్‌బై పలకాలని
"అతడు క్రికెట్‌కు గుడ్‌బై పలకాలని వారు ఎందుకు తహతహలాడుతున్నారు? బహుశా, చర్చించడానికి వేరే విషయాలు లేక అతడి గురించి చర్చిస్తున్నారా? అతడు భవిష్యత్తులో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అందరికీ తెలుసు. సమయం వచ్చినప్పుడు అతడే నిర్ణయం తీసుకొంటాడు. కాబట్టి, అది జరిగినప్పుడు అది జరగనివ్వండి" అని రవిశాస్త్రి అన్నాడు.

అతడిని అగౌరవపరిచినట్లే
"ధోనీ రిటైర్మెంట్‌పై వ్యాఖ్యలు చేయడమంటే అతడిని అగౌరవపరిచినట్లే. టీమిండియాకు ధోనీ 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. క్రికెట్ నుంచి ఎప్పుడు వైదొలగాలో అతడికి తెలుసు. టెస్టులకు గుడ్‌బై పలికినప్పుడు అతడు ఏమి చెప్పాడు? వృద్ధిమాన్ సాహాకు వికెట్ కీపింగ్ గ్లోవ్స్ అందజేయడానికి సరిపోతుంది. అతను సరైనవాడు" అని రవిశాస్త్రి వివరించాడు.

ధోని నీడలాంటి వాడు
"జట్టు విషయానికి వస్తే ధోని నీడలాంటి వాడు. టీమిండియాను విజయపథంలో నడిపించడానికి అతడి ఆలోచనలను జట్టుతో పంచుకుంటాడు. ధోనీ భవితవ్యంపై మాట్లాడే వారిలో సగం మందికి షూలేస్ కట్టుకోవడం కూడా రాదు. మీ చర్చలకు ముగింపు పలుకుతాడు. ధోనీ తనకు నచ్చినప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే హక్కుని సంపాదించుకున్నాడు" అని రవిశాస్త్రి అన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం
ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ నిష్క్రమించిన తర్వాత ధోని రెండు నెలలు పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ఆ తర్వాత విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా ధోని అందుబాటులో లేడు.

జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్
వచ్చే నెలలో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీ లేడు. అయితే, వచ్చే జనవరిలో ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నాడు. ఇప్పటికే ధోని తన ట్రైనింగ్‌ను ప్రారంభించాడు. ఇందులో భాగంగా జిమ్‌లో ధోని కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ అందుకోవడానికి జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేయనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications