

హైదరాబాద్: యూఏఈ వేదికగా ఆసియాకప్ మొదలైంది. ఉపఖండంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కప్‌ను సొంతం చేసుకోవాలని పాల్గొన్న ఆరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి. టోర్నీలో భాగంగా భారత జట్టు సెప్టెంబర్ 18(మంగళవారం)న హాంకాంగ్‌తో తన తొలిమ్యాచ్‌లో తలపడనుంది.
ఆ తర్వాతి రోజైన బుధవారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ టోర్నీకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలవనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నాయకత్వ బాథ్యతలు చేపట్టనున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ అయినప్పటికీ, జట్టుని నడిపించేది ధోని అన్నది అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో ఆసియా కప్ టోర్నమెంట్‌లో ధోని ఓ అరుదైన రికార్డుని కలిగి ఉన్నాడు. అదేంటో తెలుసా! టోర్నీ చరిత్రలోనే అత్యధిక యావరేజి 95.16. ఆసియా కప్ టోర్నీలోనే అత్యధిక యావరేజి కలిగిన ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని తన పేరిట కలిగి ఉన్నాడు.
ఆసియా కప్ టోర్నీలో ధోని తన చివరి ఏడు ఇన్నింగ్సుల్లో నాటౌట్‌గా నిలిచి 213.21 స్ట్రైక్ రేట్‌తో 113 పరుగులు చేశాడు. దీంతో పాటు 500 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో ధోనినే అత్యధిక యావరేజిని కలిగి ఉన్నాడు. ధోని ఆసియా కప్‌లో 13 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఈ జాబితాలో శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్దనే అగ్రస్థానంలో ఉన్నాడు. మహిళా జయవర్దనే శ్రీలంక జట్టుకు 28 సార్లు సారథ్యం వహించాడు.