Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని: ఒత్తిడనేది తెలియదు, కెప్టెన్ కూల్ ఎలా అయ్యాడు?

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని. భారత్ క్రికెట్‌కు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్లలో ఒకడు. మూడు ఫార్మెట్లలో కూడా భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌గా ధోనిది ప్రత్యేకమైన స్ధానం. వన్డే ప్రపంచ కప్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అందరి మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీకి వన్డే, టీ20ల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి బుధవారం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ధోని తీసుకున్న ఈ నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదు.

హాలీవుడ్ హీరో మోర్గాన్ ప్రీమాన్ సినిమాలోని 'నా విధికి నేనే మాస్టర్‌ని, నా ఆత్మకు నేనే కెప్టెన్‌ని' అనే పద్యాన్ని తన లోతైన కంఠస్వరంతో ధోని వల్లెవెస్తాడని చాలా మందికి తెలియదు. ఈ పద్యంలోని భావం వేరేలా ఉన్న ధోని తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఎంతో మంది దిగ్గ‌జ క్రికెట‌ర్లకు భిన్నంగా ఉంటాయి.

పైవీడియోని చూస్తే చాలు మిస్టర్ కూల్‌గా పిలుచుకునే ధోని గురించి చెప్పడానికి. ఇటీవల ఓ మీడియా సమావేశంలో 2019 వ‌రల్డ్‌క‌ప్ వ‌ర‌కు ఆడ‌గ‌ల‌రని అనుకుంటున్నారా? అని ఆస్ట్రేలియా రిపోర్ట‌ర్ శామ్ ఫెర్రిస్ అడిగిన ప్ర‌శ్న‌కు అతడితోనే స‌మాధానం చెప్పించాడు ధోని. ఇది చూసిన వాళ్లకు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

ధోని తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనమే

ధోని తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనమే

భారత క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేవరకూ ధోని తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సంచలనమే. మైదానంలో కూల్‌గా ఉండే ధోని అనూహ్యంగా కెప్టెన్సీ అందుకోవడం దగ్గర నుంచి.. అకస్మాత్తుగా టెస్టు సారథ్యాన్ని వదులుకోవడం అటు క్రికెటర్లతో పాటు ఇటు అభిమానుల వరకు ఆశ్చర్యపరచింది.

ధోనీ శైలి ప్రత్యేకం

ధోనీ శైలి ప్రత్యేకం

ఎంతోమంది దిగ్గ‌జ క్రికెట‌ర్లు ఉన్న భార‌త క్రికెట్‌లో ధోనీ శైలి ప్రత్యేకం. సహచరులు, ప్రత్యర్థులు, ప్రేక్షకులు వెర్రెక్కిపోతున్నా తాను మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడనేది తెలియదన్నట్లుగా అసలేమీ జరగట్లేనట్లే ధోని వ్యవహారశైలి ఉంటుంది. వన్డే ప్రపంచ కప్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌లు ఇలా మూడూ ట్రోఫీలు అందుకున్నా ప్రశాంతతే ధోని ఆయుధం.

అత్య‌ధిక మ్యాచ్‌ల‌కు కెప్టెన్‌గా చేసిన ఘ‌న‌త

అత్య‌ధిక మ్యాచ్‌ల‌కు కెప్టెన్‌గా చేసిన ఘ‌న‌త

మూడు ఫార్మాట్లు క‌లిపి ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మ్యాచ్‌ల‌కు కెప్టెన్‌గా చేసిన ఘ‌న‌త సొంతం చేసుకున్నా... మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ అయినప్పటికీ వీట‌న్నింటికీ మించిన ఓ లోప‌లి మ‌నిషి ధోనీని మిగ‌తా ప్లేయ‌ర్స్‌తో వేరు చేస్తాడు. న‌రాలు తెగే ఉత్కంఠ‌లోనూ కూల్‌గా ఉంటాడు.

ధోని కష్టపడే మనస్తత్వంతో పాటు లక్

ధోని కష్టపడే మనస్తత్వంతో పాటు లక్

వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ చివ‌రి ఓవ‌ర్లో జోగింద‌ర్‌ సింగ్‌లాంటి స్ఫిన్నర్‌కు కూడా బౌలింగ్ ఇస్తాడు. ధోని కష్టపడే మనస్తత్వంతోపాటు లక్ కూడా ఎన్నో సార్లు కలిసొచ్చింది. గంగూలీ తర్వాత టీమిండియాను ఓ కొత్త పంథాలో న‌డిపించిన ఘ‌న‌త ధోనీ సొంతం. ఇంత సాధించినా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను తాను బేరీజు వేసుకోవ‌డం ధోనీలో ఉన్న గొప్ప లక్షణం.

ధోనిలో చ‌రిష్మా త‌గ్గుతూ వ‌స్తోంది

ధోనిలో చ‌రిష్మా త‌గ్గుతూ వ‌స్తోంది

2014లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోనిలో చ‌రిష్మా త‌గ్గుతూ వ‌స్తోంది. అత‌నిలో ఉన్న గొప్ప ఫినిష‌ర్ కూడా ఈ మ‌ధ్య క‌నిపించ‌డం లేదు. కెప్టెన్‌గా తాను తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా విఫ‌ల‌మ‌వుతున్నాయి. దీంతో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో వ‌న్డే, టీ20 కెప్టెన్సీకి గుడ్ బై పలికాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+