ధోని మార్గనిర్దేశకుడి పాత్రను సరిగ్గా పోషించాడు: ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం


హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా తొలిసారి 2-1 తేడాతో ద్వైపాక్షిక సిరీస్ సొంతం చేసుకోవడంలో టీమిండియా మాజీ క్రికెటర్ ధోని కీలకపాత్ర పోషించాడు. వరుసగా మూడు వన్డేల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. అడిలైడ్, మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండు, మూడు వన్డేలలో జరిగిన మ్యాచ్‌ల్లో ఛేదనలో రెండు సార్లు అజేయంగా నిలిచాడు.
పరుగులు తీయడం కష్టంగా ఉన్న పిచ్‌పై ముందుగా పాతుకుపోయాడు. దీంతో ఆసీస్ గడ్డపై సిరీస్ ఓటమి చవిచూడని మొదటి పర్యాటక జట్టుగా భారత్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దిగ్గజ కెప్టెన్లుగా పేరుగాంచిన గవాస్కర్, కపిల్‌దేవ్, గంగూలీ, ధోనీకి సాధ్యంకాని ఫీట్‌ను ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీ అందిపుచ్చుకున్నాడు.
శుక్రవారం ఆసీస్‌తో జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ధోని( 87 నాటౌట్), కేదార్ జాదవ్(61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు.
కేదార్ జాదవ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు ధోని 121 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో 2011 తర్వాత ధోని 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అందుకున్నాడు. సిరీస్ విజయం సాధించడంతో ధోని, టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
సచిన్ టెండూల్కర్
అద్భుత క్రికెట్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ను, పర్యటనను ముగించింది. వచ్చిన అవకాశాన్ని కేదార్ జాదవ్ ఉపయోగించుకోవడం సంతోషంగా ఉంది. ఎంఎస్ ధోనీకి బాగా సహకరించాడు. ఇక ధోని మార్గనిర్దేశకుడి పాత్రను సరిగ్గా పోషించాడు.
వీరేంద్ర సెహ్వాగ్
ఓం ఫినిషాయ నమః టెస్టు సిరీస్, వన్డే సిరీస్ కైవసం
బీసీసీఐ
అద్భుత ఛేదన. ధోనీ-జాదవ్ ద్వయం టీమిండియాకు 7 వికెట్ల తేడాతో విజయం అందించింది. సిరీస్ 2-1తో టీమిండియా పరమైంది.
హర్భజన్‌సింగ్
అబ్బురపరిచే క్రికెట్. కుర్రాళ్లకు అభినందనలు. ఎంఎస్ ధోనీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు సానుకూలం. అత్యంత కీలకం. కేదార్ జాదవ్ శెభాష్. మజా వచ్చింది. పర్యటనను 2-1తో ముగించారు.
వీవీఎస్ లక్ష్మణ్
ధోని నుంచి ప్రశాంతమైన ఇన్నింగ్స్. కేదార్ జాదవ్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా వన్డే, టెస్టు సిరీస్ గెలిచింది. టీమిండియాకు ఇది అత్యంత ఫలప్రదమైన పర్యటన.
మైకేల్ క్లార్క్
టీమిండియాకు మరో సిరీస్ విజయం. అభినందనలు. మూడు ఫార్మాట్లలో ఎంతో కష్టపడ్డారు.
సురేశ్ రైనా
ఎవరిపై ఆధారపడాలో వర్ణించాలంటే అక్కడంతా ధోని పేరే రాస్తారు. టీమిండియా అభినందనలు. అద్భుత విజయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications