For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా అందించిన గ్రేటెస్ట్ క్రికెటర్ ధోనియే: కపిల్ దేవ్

MS Dhoni greatest cricketer India has ever produced: Kapil Dev

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు వచ్చిన టీమిండియా క్రికెటర్లలో ధోని అత్యంత గొప్ప క్రికెటర్ అని కపిల్ దేవ్ అన్నాడు. తాజాగా ఆజ్ తక్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కపిల్‌ దేవ్‌‌ని "ధోనీతో మీకున్న అనుభవాలేంటి?" అని అడగ్గా తనదైన శైలిలో స్పందించారు.

"భారతీయ క్రికెట్‌ చరిత్రలో ఇంతవరకు వచ్చిన టీమిండియా క్రికెటర్లలో ధోని అత్యంత గొప్ప క్రికెటర్‌. 90 టెస్టులాడిన తర్వాత ధోని హఠాత్తుగా రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. తొలుత ధోని నిర్ణయాన్ని నేను కూడా తప్పు పట్టాను. కానీ తన నిర్ణయంలో ఉన్న అంతరార్థం నాకు తర్వాత బోధపడింది" అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.

"యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోని నిర్ణయానికి హ్యాట్రాఫ్. కెప్టెన్సీ నుంచి ధోని దూరమయినా అతడిలో ఆ లక్షణాలు మాత్రం ఎక్కడికీ పోలేదు. అతడెలాంటి క్రికెటరో యావత్‌ క్రికెట్‌ అభిమాన లోకానికి తెలుసు. 2019 వరల్డ్ కప్‍‌లో మరోసారి ధోనీని చూస్తాననుకుంటున్నాను" అని కపిల్ అన్నాడు.

"2011 వరల్డ్ కప్ ఫైనల్లో ఇన్నింగ్స్‌ని ధోని అద్భుతంగా ముగించాడు. ధోని సలహాలు, సూచలను ఇప్పటికీ టీమిండియాకు ఎంతో అవసరం" అని కపిల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే, కపిల్‌ దేవ్ కెప్టెన్సీలో 1983లో టీమిండియా ప్రపంచకప్‌ గెలిచింది. ఆ తర్వాత 2011లో ధోని కెప్టెన్సీలో టీమిండియా మరో వరల్డ్‌కప్‌ను సాధించింది.

Story first published: Wednesday, December 19, 2018, 17:22 [IST]
Other articles published on Dec 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+