
భారత జట్టు విజయాల్లో కోహ్లీ, ధోనిలదే కీలకపాత్ర
రెండో వన్డే అనంతరం వార్నర్ మీడియాతో మాట్లాడాడు. కోహ్లీ, ధోనిలు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైదానంలో కోహ్లీకి ధోని విలువైన సూచనలు ఇవ్వడంతో పాటు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడని వార్నర్ తెలిపాడు. ఆసీస్‌తో సిరిస్‌కు ముందు భారత జట్టు వెస్టిండిస్, శ్రీలంకతో జరిగిన వన్డే సిరిస్‌లలో కోహ్లీసే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐదు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే భారత్ 2-0తో ఆధిక్యంలో
ఇక, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో వన్డేలో విజయం సాధిస్తే ఐదు వన్డేల సిరిస్ భారత్ వశమవుతుంది. దీనిపై కూడా వార్నర్ స్పందించాడు. 'ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు కామ్‌గా తన పని తాను చేసుకుపోయాడు. కెప్టెన్ జాబ్‌కి అతడు పూర్తి న్యాయం చేశాడు' అని వార్నర్ అన్నాడు.

కోహ్లీని ధోనినే నడిపిస్తున్నాడు
'ఇక, కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ధోని జట్టు విజయాల్లో కీలకాపాత్ర పోషిస్తున్నాడు. నిజం చెప్పాలంటే కోహ్లీని ధోనినే నడిపిస్తున్నాడు. వీరిద్దరి కలయికే టీమిండియాకి అద్భుత విజయాలు అందిస్తోంది' అని వార్నర్ తెలిపాడు. ఇక కోహ్లీసేనకు నిజమైన సవాల్ ఎప్పుడు ఎదురవుతుందన్న ప్రశ్నకు వార్నర్ తనదైన శైలిలో స్పందించాడు.

కుంగదీసే అపజయాలు ఎదురుకాలేదు
'కోహ్లీని ఇప్పటి వరకు మానసికంగా కుంగదీసే అపజయాలు ఎదురుకాలేదు. ఎప్పుడైతే వరుస అపజయాలు ఎదురవుతాయో అప్పుడు అసలైన సవాలు ఎదురవుతోంది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఇంకా మూడు వన్డేలు జరగాల్సి ఉంది. ఏదైనా జరగవచ్చు. కోహ్లీలో మరో కెప్టెన్ కనిపిస్తాడేమో' అని వార్నర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది.


Click it and Unblock the Notifications