న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వీ హక్' ధోనీ కొత్త హెయిర్ స్టైల్..

MS Dhoni Goes Retro with Latest Hairstyle

హైదరాబాద్: ధోనీ వయస్సు పెరిగిపోతున్నా.. రిటైర్‌మెంట్‌కు దగ్గర పడుతున్నాఈ తరం ఆటగాళ్లతో ఏ మాత్రం తీసిపోకుండా రాణిస్తున్నాడు. కేవలం ఆటలోనే కాదు. ట్రెండ్‌కు తగ్గట్టే ఎప్పటికప్పడు కొత్తగా కనిపిస్తూ.. ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో తెల్లటి గడ్డంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తాజాగా కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడు.

కొత్త స్టైల్స్‌తో అభిమానులను కనువిందు చేస్తూ ఫ్యాషన్‌ సింబల్‌గా నిలుస్తుంటాడు. ప్రస్తుతం ధోని ప్రయోగించిన ఈ కొత్త హెయిర్‌ స్టైల్‌ పేరేంటంటే.. 'వీ హాక్‌'. ఇంగ్లండ్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ధోని.. ప్రస్తుతం ముంబైలొ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌‌ వద్ద ఈ కొత్త హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడు. అనంతరం సెలూన్‌ నిర్వాహకులు ధోని ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.

దీంతో ఈ ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి. ఈ కొత్త లుక్‌ అభిమానులకు తెగ నచ్చేసింది. దీంతో వారు ధోనీ కొత్త హెయిర్‌ స్టైల్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇలా హెయిర్ స్టైల్ విషయంపై ట్రెండీ అవడం ధోనీకి కొత్తేం కాదు. ఇటీవల తన 37వ పుట్టిన రోజున హార్దిక్ పాండ్యా ద్వారా స్పెషల్ గిఫ్ట్ రూపంలో కొత్తగా ట్రై చేశాడు.

ఈ ప్రత్యేకమైన రోజునాడు ధోనీకి నా ప్రత్యేకమైన హెయిర్ కట్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు పాండ్యా ట్విటర్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇది ఎక్స్‌పర్ట్స్ చేసే పని.. ఇంట్లో ఎవరూ ప్రయత్నించకూడదు అంటూ కింద ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టాడు. ఇక బర్త్‌డే కేక్ కట్ చేసిన సందర్భంగా తాను స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు కేక్ రుద్దుతున్న వీడియోను ధోనీ షేర్ చేశాడు.

Story first published: Monday, July 30, 2018, 13:12 [IST]
Other articles published on Jul 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X