‘బలిదాన్ బ్యాడ్జ్’పై రచ్చ: ధోనితో పాటు భారత్‌కు ఐసీసీ క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ధరించిన 'బలిదాన్ బ్యాడ్జ్' లోగోను తొలగించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సూచించడంపై టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ మండిపడ్డాడు. ఈ విషయంలో ధోనితో పాటు యావత్ భారతావనికి ఐసీసీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా శుక్రవారం ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ "ధోనితో పాటు యావత్ దేశానికి ఐసీసీ క్షమాపణ చెప్పాలి. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోన్న భారత్ లాంటి దేశంతో నిబంధనలను నిర్దేశించడానికి ఇది సరైన మార్గం కాదు. పారాచూట్ రెజిమెంట్ ధోనికి సముచిత గౌరవం కల్పించింది" అని అన్నాడు.

భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు
"అలాగే, భారత్ మిలటరీకి ధోని ఎంత గౌరవం ఇస్తాడో అందరికీ తెలుసు. ఒంటి చేత్తో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ఘనత ధోనిది. కేవలం ఒకటో-రెండో వరల్డ్‌కప్‌లను ధోని గెలవలేదు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తనదైన ముద్ర వేస్తూ భారత్ క్రికెట్‌కు వన్నె తెచ్చాడు. ఈ సమయంలో ప్రతీ భారతీయుడు ధోనికి అండగా నిలుస్తారనే అనుకుంటున్నా" అని శ్రీశాంత్ తెలిపాడు.

ఐసీసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
"ఐసీసీ కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని... భారత్ ప్రజలను క్షమపణలు కోరుతూ లేఖ రాస్తుందని భావిస్తున్నా. ధోనీని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఆ గ్లౌజులతో ధోని ఆడటాన్ని చూసి నెనెంత గర్వపడ్డానో తెలియదు. ఈ గ్లౌజులు ధరించి ధోని భారత్‌కు వరల్డ్ కప్ గెలవాలి" అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ ఇలా
ఇక, బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ మాట్లాడుతూ "చాలా సందర్భాల్లో ఆటగాళ్లు వివిధ రకాలైన క్యాప్‌లను ధరిస్తూ ఉంటారు. అటువంటప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకొచ్చింది" అని ప్రశ్నించాడు. మరోవైపు ట్విట్టర్‌లో #DhoniKeepTheGlove అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తూ భారత అభిమానులు ధోనీకి మద్దతు నిలుస్తున్నారు.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ టీషర్టులపై మూడు సింహాల లోగో
"ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైతం తమ టీషర్టులపై మూడు సింహాల లోగో వేసుకున్నారని, అది కూడా ఆ దేశ సైనికుల త్యాగానికి చిహ్నమేనని" మరోక నెటిజన్ కామెంట్ పెట్టాడు. మనకు ఆటకన్నా దేశ గౌరవం ముఖ్యమని అభిమానులు ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తున్నారు. ఐసీసీ సంపదలో 80 శాతం వాటా మనదేనని, టోర్నీ నుంచి నిష్క్రమిస్తానంటే ఐసీసీ దారిలోకి వస్తుందని ట్వీట్లు చేస్తున్నారు.

వినోద్ రాయ్ మాట్లాడుతూ
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై బీసీసీఐ పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ స్పందించారు. ధోని ధరించిన గ్లౌజ్‌పై ఉన్న లోగోను తొలగించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ధోని ధరించిన గ్లౌజ్‌పై ఉన్న లోగో మిలటరీ సింబల్ కాదు. దీనిపై రాద్ధాంతం అనవసరం. ఐసీసీ నిబంధనల్ని ధోని అతిక్రమించలేదు. ఇందుకు ఐసీసీ అనుమతి కోరాం" అని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications