Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni : చెన్నై టీంకు కోహ్లీ టెక్నిక్ వివరిస్తూ.. బ్యాటింగ్ పాఠాలు చెప్పిన ధోనీ..!

మోడర్న్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ప్లేయరో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అతన్ని చూసి చాలా మంది క్రికెటర్లు స్ఫూర్తి పొందుతారనడం అతిశయోక్తి కాదు. మైదానంలో ఎప్పుడూ నూటికి నూరు శాతం కృషి చేసే ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. అదే సమయంలో కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

కోహ్లీ తర్వాత క్రికెట్‌లోకి వచ్చిన చాలా మంది అతని టెక్నిక్‌ను చూసి ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే అతన్ని మోడర్న్ గ్రేట్‌గా విమర్శకులు కూడా అంగీకరిస్తారు. అలాంటి కోహ్లీ గురించి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి తెలియకుండా ఉంటుందా? అందుకే తన చెన్నై టీంకు బ్యాటింగ్ పాఠాలు చెప్పేటప్పుడు కోహ్లీని ఎగ్జాంపుల్ తీసుకున్నాడీ లెజెండరీ కెప్టెన్.

MS Dhoni Virat Kohli Technique

చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన అనంతరం.. డ్రెస్సింగ్ రూంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం మెంబర్స్‌కు ధోనీ కొన్ని పాఠాలు చెప్పాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ పాఠాలు చెప్పే సమయంలో కోహ్లీ స్టైల్‌ను ఉదాహరణగా తీసుకున్నాడు. పూర్తిగా ధోనీ ఏం చెప్పాడో తెలియడం లేదు కానీ.. తొలి బంతిని కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడో ధోనీ వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సంభాషణ మొత్తం బయటకు రాకపోవడంతో ధోనీ వివరణ అంతా వెల్లడికాలేదు. అయితే మ్యాచ్ ఆడే సమయంలో కోహ్లీ ఎదుర్కొనే తొలి బంతి గురించి ధోనీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 'విరాట్ ఎప్పుడూ తన ఫస్ట్ బాల్‌ను అలా ఫేస్ చేయడు. అలాంటి షాట్లు ఆడడు. బ్యాట్ ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది' అంటూ కోహ్లీ టెక్నిక్‌ను వివరించే ప్రయత్నం చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన క్షణాల్లోనే తెగ వైరల్ అయింది. ధోనీ, కోహ్లీ బంధం గురించి తెలిసిన అభిమానులకు తెగ నచ్చేసింది. చెన్నై తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. చెపాక్ వేదికగా బుధవారం నాడు ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

Story first published: Monday, May 8, 2023, 14:14 [IST]
Other articles published on May 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+