
ఇంట్లోకి స్వాగతం:
పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్‌తో ఎంఎస్ ధోనీ తన రిటైర్‌మెంట్‌ను గొప్పగా చేసుకున్నాడట. దీనికి సంబంధించిన ఫోటోలను మహీ భార్య సాక్షి ధోనీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'ఇంట్లోకి స్వాగతం.. మిస్ యూ మహీ' అని కాప్షన్ రాసుకొచ్చారు. ఫొటోలతో పాటు ఓ వీడియోను కూడా సాక్షి షేర్ చేశారు. డ్యూయల్ రేసింగ్ గీతలతో ఎరుపు రంగుతో ఉన్న ట్రాన్స్ యామ్.. ధోనీ కార్ గ్యారేజీలో అద్భుతంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ కారు మహీ వద్దకు చేరుకుందట.

ఇక్కడ దొరకడం చాలా అరుదు:
పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్ 1970లలో తయారు చేసిన ఒక అమెరికన్ కారు. ఇది భారతదేశంలో దొరకడం చాలా అరుదు. మహీ కారు 1971-1973 మధ్య తయారు చేసిన ప్రారంభ మోడల్‌గా కనిపిస్తుంది. ఈ కారు V8 బిగ్ బ్లాక్ ఇంజిన్ 455 ఇంజిన్‌తో నడిచే లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వెర్షన్‌ను కలిగి ఉంది. మహీకి ఈ కారంటే ఎంతో ఇష్టమట. అందుకే ఎంతకష్టమైనా.. ఇష్టపడి కొనుక్కున్నాడు.

మహీ గ్యారేజీలో మరెన్నో:
మహీ గ్యారేజీలో హమ్మర్ హెచ్ 2, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ అలాగే రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో సిరీస్ 1, మిత్సుబిషి పజెరో ఎస్‌ఎఫ్‌ఎక్స్, పాత తరం టయోటా కరోలాతో సహా మరిన్ని వాహనాలను ఉన్నాయి. వీటితో పాటు మొదటి తరం ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2 లాంటివి ఎన్నో ఉన్నాయి. మహీకి కార్లతో పాటు బైకులు కూడా ఎంతో ఇష్టం. ఎక్స్ 132 హెల్కాట్, కవాసాకి నింజా హెచ్ 2, డుకాటీ 1098, యమహా ఆర్డి 350, రాయల్ ఎన్ఫీల్డ్ మాచిస్మో, సుజుకి షోగన్, యమహా వైజెడ్ఎఫ్ 600 ఆర్, బిఎస్ఎ గోల్డ్‌స్టార్‌తో సహా ఇంకా ఉన్నాయి.
చెన్నైలో ధోనీ:
ప్రస్తుతం ఎంఎస్ ధోనీ చెన్నైలో ఉన్నాడు. ఐపీఎల్ 2020 కోసం మూడు రోజుల క్రితమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులతో కలిశాడు. వచ్చేముందు రాంచీలో కరోనా టెస్ట్ చేయించుకుని వచ్చాడు. గత రెండు రోజులుగా మహీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐపీఎల్ కోసం మహీ ఈ నెల 22న దుబాయ్ వెళ్లనున్నాడు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications












