ధోనికి ఇచ్చిన విలువ నాకెందుకివ్వరు?: అక్కసు వెళ్లగక్కిన హర్భజన్ (ఫోటోలు)
హైదరాబాద్: సెలక్టర్లపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అక్కసును వెల్లగక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి తనను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లపై తన అసంతృప్తిని ప్రదర్శించాడు. ధోనికి ఇచ్చినంత విలువ అంతకన్నా సీనియర్ అయిన తనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించాడు.
ప్రస్తుతం ఫామ్‌లో లేని ధోనిని ఎంపిక చేసినవాళ్లు తనను ఎందుకు ఎంపిక చేయలేదని హర్భజన్ నిలదీశాడు. అనుభవం విషయంలో తాను కూడా తక్కువ కాదని భజ్జీ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జట్టుని ఎంపిక చేసినప్పుడు బ్యాటింగ్‌తో పాటు ధోని అనుభవం, వ్యూహాలు జట్టుకు పనికొస్తాయనే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్న సంగతి తెలిసిందే.

కడిగిపారేసిన హర్భజన్ సింగ్
ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలపై తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో హర్భజన్ సింగ్ కడిగిపారేశాడు. 'అతను ఫామ్‌లో ఉన్నా లేకపోయినా టీమ్‌లో ఉంటే మిగతా యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాడు నిజమే. అతనికి కలిసొచ్చేది అదే. నా విషయంలో మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు' అని అన్నాడు.

ధోనికి ఇచ్చిన విలువ నాకు ఇవ్వలేదు
'అతనికిచ్చిన విలువ నాకు ఇవ్వలేదు. నేను కూడా 19 ఏళ్లుగా ఆడుతున్నా. రెండు వరల్డ్‌కప్ గెలిచాను. కానీ కొందరికీ ఆ గౌరవం దక్కుతుంది. ఇంకొందరికి దక్కడం లేదు. అందులో నేను ఒకడిని అని హర్భజన్ కుండబద్ధలు కొట్టేశాడు. అలా ఎందుకు అని అడిగితే.. అది సెలక్టర్లకే తెలియాలి' అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.

తీవ్రస్థాయిలో మండిపడ్డ హర్భజన్ సింగ్
అంతేకాదు ఛాంపియన్ ట్రోఫీకి జట్టుని ఎంపిక చేసే సమయంలో వెటరన్ ఆటగాడు గౌతం గంభీర్ లేదా తన పేరును కనీసం చర్చకు కూడా తీసుకురాకపోవడంపై హర్భజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఐపీఎల్ ఫైనల్లో ఆడించకపోవడంపై కూడా భజ్జీ అసంతృప్తి వ్యక్తంచేశాడు.

అశ్విన్ ఫిట్‌గా లేకపోతేనే నన్ను ఎంపిక చేస్తారు
'అశ్విన్ ఫిట్‌గా లేకపోతేనే నన్ను ఎంపిక చేస్తారు. చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధంగా ఉండాలనే అతనికి ఐపీఎల్ నుంచి విశ్రాంతి కల్పించారు. కానీ ఒక ప్లేయర్ బాగా ఆడినపుడు అతన్ని గుర్తించాలి. ఇద్దరు ప్లేయర్స్‌కు వేర్వేరు రూల్స్ ఎలా వర్తిస్తాయి' అని భజ్జీ మండిపడ్డాడు. కాగా, హర్భజన్ సింగ్ భారత్ తరుపున 103 టెస్టులు, 236 వన్డేలతో పాటు 28 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మెట్లలో కూడా వరుసగా 417, 269, 25 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications