Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni : వాడు మెచ్యూర్ అవడం నా జన్మలో చూడలేను: ధోనీ!

ఇటీవలే తన 42వ బర్త్ డే జరుపుకున్న టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. తన సహచర ఆటగాడైన దీపక్ చాహర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ధోనీ.. తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న దీపక్ చాహర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు.

జట్టులో చాహర్ ఉన్నా లేకపోయినా ఇబ్బందేనని ధోనీ చెప్పాడు. అతనొక డ్రగ్ వంటి వాడంటూ జోక్ చేశాడు. 'దీపక్ చాహర్ ఒక డ్రగ్ వంటి వాడు. అతను లేకపోతే.. ఎక్కడ ఉన్నాడ్రా? అనిపిస్తుంది. ఒకవేళ అతను ఉంటే.. వీడు ఎందుకు ఉన్నాడ్రా? అనిపిస్తుంది. అతను మెచ్యూర్ అవుతున్నాడు. ఇది చాలా మంచి విషయం. కానీ మెచ్యూర్ అవడానికి చాహర్ చాలా టైం తీసుకుంటున్నాడు. నా జీవితంలో అతను మెచ్యూర్ అవడం చూడలేను' అంటూ నవ్వేశాడు.

MS Dhoni funny comments on his teammate Deepak Chahar

గతేడాది గాయం నుంచి కోలుకొని టీమిండియాలో పునరాగమనం చేసిన చాహర్.. టీ20 వరల్డ్ కప్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అతని గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతను జట్టుకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్‌లో ఆడిన అతను మంచి ఫామ్ కనబరిచాడు. అయితే సీజన్ మూడో మ్యాచులోనే అతను గాయపడ్డాడు. దీంతో మళ్లీ ఆటకు దూరమయ్యాడు.

అయితే ఆ తర్వాత పునరాగమనం చేసిన అతను చక్కగా రాణించాడు. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచులు ఆడిన అతను 8.73 ఎకానమీతో 13 వికెట్లు తీసుకున్నాడు. కానీ వెస్టిండీస్‌తో వన్డే, టీ20లు ఆడే జట్టులో అతన్ని ఎంపిక చేయలేదు. ముఖ్యంగా టీ20 జట్టులో అతన్ని తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం అతన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. మరి వన్డే వరల్డ్ కప్‌ ఆడే జట్టులో అతనికి చోటు దక్కుతుందేమో చూడాలి.

Story first published: Tuesday, July 11, 2023, 9:34 [IST]
Other articles published on Jul 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+