For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్మీ బెటాలియ‌న్‌తో కలిసిన ధోనీ.. క‌శ్మీర్‌లో ఉద్యోగం

MS Dhoni Begins Training With Parachute Regiment || Oneindia Telugu
MS Dhoni fulfils promise, begins training with Parachute Regiment

బెంగళూరు: మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్‌ విభాగంలో తన రెండు నెలల శిక్షణను ప్రారంభించాడు. బుధవారం ధోనీ బెటాలియన్‌తో కలిసాడు. ధోనీ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. క‌శ్మీర్‌లో ఉద్యోగం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

క‌శ్మీర్‌లో ఉన్న విక్ట‌ర్ ఫోర్స్‌తో ధోనీ క‌ల‌వ‌నున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్ డ్యూటీల‌ను ధోనీ నిర్వర్తించనున్నాడు. భ‌ద్ర‌తా ద‌ళాల‌తో 15 రోజులు పాటు ధోనీ గ‌డ‌ప‌నున్నాడు. 'భారత క్రికెట్ గొప్ప సేవకులలో ధోనీ ఒకడు. సాయుధ దళాల పట్ల ఆయనకున్న ప్రేమ కూడా అందరికీ తెలుసు. ఆర్మీతో పనిచేయాలని అతని ఆలోచన అద్భుతం. ఆర్మీతో మంచి సమయం గడపాలని కోరుకుంటున్నా. యువతలో అవగాహన పెంచడానికి కూడా సహాయపడుతుంది' అని ఓ ఆర్మీ అధికారి తెలిపారు.

పారామిలటరీ రెజిమెంట్‌లో సేవలందించేందుకు రెండు నెలల పాటు భారత జట్టుకు అందుబాటులో ఉండను అని బీసీసీఐకి ధోనీ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌కు ధోనీ దూరంగా ఉన్నాడు. అతను స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్‌లకు వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నయ కీపర్‌గా ఎంపిక చేశారు.

Story first published: Thursday, July 25, 2019, 13:25 [IST]
Other articles published on Jul 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+