Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన కొత్త బైక్ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ధోనీ (ఫోటో)

రాంచీ: భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ద్విచక్ర వాహనాలు (బైక్) అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిత్యం క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉండే ధోనీ ఏమాత్రం సమయం చిక్కినా.. తన హోంటౌన్ రాంచీలో ఉన్నప్పుడు తన బైక్ తీసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడు.

బుధవారం నాడు ధోనీ తన కొత్త ద్విచక్ర వాహనాన్ని బయట పెట్టాడు! అతను తన కొత్త బైక్ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు. అయితే, దానిని ఉపయోగించేందుకు ఆతృతగా ఎదురు చూసినట్లు పేర్కొన్నాడు. తాను మరో నెలన్నర రోజుల తర్వాత రైడ్ చేస్తుండవచ్చునని పేర్కొన్నాడు.

కాగా, అలాంటి కూల్ కెప్టెన్ ధోనీ బైకు పైన వీధుల్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఆయన సోమవారం నాడు జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో బుల్లెట్ పైన తిరిగారు. ఎంహెచ్పీ 6518 అనే నెంబర్ ఉన్న బుల్లెట్ వాహనం పైన ధోనీ రోడ్డు పైకి వచ్చారు.

MS Dhoni flaunts his brand new Kawasaki bike on Instagram

ఇటీవలి వరకు ప్రపంచ కప్ టోర్నమెంటుతో ధోనీ సేన బిజీగా గడిపింది. ఐపీఎల్ 8 ప్రారంభానికి రెండు రోజుల ముందు అతని రాంచీ వీధుల్లో ఆహ్లాదంగా చక్కెర్లు కొట్టాడు. ఇదిలా ఉండగా, ధోనీకి రాంచీ ట్రాఫిక్ ఫోలీసులు షాకిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం తన బుల్లెట్ బైక్‌పై రాంచీ రోడ్లపై తెగ తెరిగిన ధోనీకి.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంచించారని రూ.450 జరిమానా విధించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+