5000 పరుగులు: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డు

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగులు చేసిన తొలి టీ20 బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో 34 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ధోని... తెలుగు కుర్రాడు అంబటి రాయుడి (82; 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో 206 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా చేధించిన సంగతి తెలిసిందే. 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైని వీరిద్దరూ ఆదుకున్నారు.
61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాయడు ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఉమేశ్ యాదవ్ జారవిడిచాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్ 15 ఓవర్ల వరకు బెంగళూరు వైపే ఉన్నప్పటికీ, చివరి 5 ఓవర్లలో బెంగళూరు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

రాయుడుని రనౌట్ చేసిన ఉమేశ్ యాదవ్
18 ఓవర్‌లో రాయుడు 82(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)ను ఉమేశ్ యాదవే రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌లో 5వ వికెట్ భాగస్వామ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సెంచరీ పరుగులు సాధించటం ఇదే తొలిసారి. రాయుడు-ధోనీ కలిసి 59 బంతుల్లో 101 పరుగులు సాధించారు.

సిక్సుతో చెన్నైకి విజయాన్ని అందించిన ధోని
రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చి బ్రేవో (14) సాయంతో ధోని (70) గెలుపుని సిక్సుతో లాంఛనంగా పూర్తి చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ గతంలో కూడా (2012 చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో) 206 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చేధించింది.

ధోని అరుదైన రికార్డు
ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఈ రికార్డు గంభీర్ పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం సిక్స్‌ల సంఖ్య 33. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా అత్యధికం.

100 వికెట్ల క్లబ్‌లో ఉమేశ్ యాదవ్
ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్... చెన్నై ఆటగాడు మన్దీప్ సింగ్ వికెట్ తీయడం ద్వారా ఐపీఎల్‌లో వంద వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

రెండు సార్లు చేధించిన రెండో జట్టుగా చెన్నై
ఒక సీజన్‌లో 200కుపైగా పరుగుల టార్గెట్‌ను రెండు సార్లు చేధించిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. (ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 203 పరుగుల టార్గెట్‌ను చేధించిన సంగతి తెలిసిందే) గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ ఘనతను సాధించింది. 2014 సీజన్‌లో దక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications