Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

400 నాటౌట్‌: కీపర్‌గా ధోని అరుదైన ఘనత

MS Dhoni

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ధోని అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 400 ఔట్లలో భాగస్వామి అయిన వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.

మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్‌ రెండో బంతికి దక్షిణాఫ్రికా కెప్టెన్‌ మర్క్రమ్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత అందుకున్నాడు. దీంతో 304 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది.

ఈ స్టంపౌట్‌తో ధోని వికెట్ల వెనకన ఉండి 400 మందిని పెవిలియన్‌కు పంపించిన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ధోని 314 వన్డేల్లో 399 డిస్మిసల్స్‌ చేశాడు. సెంచూరియన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో భువీ బౌలింగ్‌లో హషీమ్‌ ఆమ్లాను క్యాచ్‌ అవుట్‌ చేసి కీపర్‌గా 399వ వికెట్‌ సాధించాడు.

ఇందులో 294 క్యాచులు, 105 స్టంపింగ్స్‌ ఉన్నాయి. తాజా స్టంపౌట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 400 ఔట్లలో భాగస్వామి అయిన నాలుగో వికెట్‌ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ధోనికి ముందు ఈ ఘనత సాధించిన వారిలో శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర (482), ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌(472), దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్‌(424) ముందు వరుసలో ఉన్నారు.

గతేడాది సెప్టెంబర్‌లో అత్యధిక స్టంపౌట్ల రికార్టుని ధోని(100) తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో కుమార సంగక్కర(99) స్టంపౌట్ల రికార్డుని ధోని అధిగమించిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 7, 2018, 23:36 [IST]
Other articles published on Feb 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+