న్యూఢిల్లీ: భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు విరుచుకుపడ్డారు. అందుకు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బర్త్ డే కారణం కావడం విశేషం. ట్విట్టర్‌ను వేదికగా చేసుకుని ధోనీ అభిమానులు భజ్జీని టార్గెట్ చేశారు.
శుక్రవారంనాడు సౌరవ్ గంగూలీకి భజ్జీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా అభివర్ణించాడు. ఈ వ్యాఖ్యలతో ధోనీ అభిమానులు రెచ్చిపోయారు. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా గంగూలీని భజ్జీ పేర్కోనడం ధోనీ అభిమానులకు కోపం తెప్పించింది.

భజ్జీని విమర్శిస్తూ ధోనీ అభిమానులు ట్వీట్టర్‌లో దుమ్ము దులిపారు. ధోనీ భజ్జీని వాటర్ బాయ్‌ని చేశాడని, జట్టులో లేకుండా చేసినందుకు నిరాశతో వేగిపోతున్నాడని, ధోనీ భజ్జీని పక్కన పెట్టి అశ్విన్‌కు ప్రాధాన్యం ఇచ్చాడని, దీంతో భజ్జీ ఈర్ష్యపడుతున్నాడని వారు వ్యాఖ్యలు చేశారు.
గంగూలీ బెస్ట్ కెప్టెన్ అయితే, ధోనీ పరిస్థితి ఏమీటి అంటూ భజ్జీ ఇలా ట్వీట్ చేసినందుకు మల్లీ టీమిండియాకు ఎంపిక కాడని అన్నారు. తన నాయకత్వంలో గంగూలీ హర్భజన్, యువరాజ్, సెహ్వాగ్, జహీర్ వంటి ఆటగాళ్లను ప్రోత్సహించాడు.