

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరిస్ ముగియడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత్‌కు తిరిగొచ్చాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ధోని తన భార్య సాక్షి క్లోజ్ ఫ్రెండ్ పూర్ణా పటేల్ సంగీత్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
పూర్ణా పటేల్ ఎవరో కాదు... మాజీ కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్ కుమార్తే. ప్రముఖ పారిశ్రామిక వేత్త నమిత్ సోనీని పూర్ణా పటేల్ వివాహం చేసుకోనున్నారు. నమిత్ సోనీ ప్రస్తుతం నామ్కో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
అమెరికాలోని ఫిష్ కాలేజీ ఆఫ్ బిజినెస్ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో వీరిద్దరూ కలిసి పలు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లకు హాజరయ్యారు. దీంతో తమ పెళ్లికి హాజరుకావల్సిందిగా ధోనిని కోరడంతో ధోని కుటుంబ సమేతంగా ఈ పెళ్లికి హాజరయ్యాడు.
ముంబైలో జరిగిన ఈ సంగీత్ కార్యక్రమానికి ధోనితో పాటు యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సంగీత్ కార్యక్రమం క్రికెటర్లు అందరికీ ఓ మిని-రీయూనియన్‌గా పనికొచ్చింది. పూర్ణా-నిమిత్‌ల పెళ్లి శుక్రవారం జరగనుంది.
వీరి పెళ్లికి జహీర్ ఖాన్ తన భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేతో హాజరుకాగా, ఇర్ఫాన్ పఠాన్ తన కుమారుడు ఇమ్రాన్‌తో కలిసి హాజరయ్యాడు. ఈ సంగీత్ కార్యక్రమానికి ధోని భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఆశ్చర్యపరిచాడు. ధోని కుమారెత్ జీవా మాత్రం ఈ కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది.