For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీ పర్యటనలో ధోని ముంగిట రెండు మైలురాళ్లు

By Nageshwara Rao
IND vs SA 5th ODI : Dhoni Eyes Two ODI Milestones

హైదరాబాద్: ప్రస్తుతం కోహ్లీసేన సుదీర్ఘమైన సిరిస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. సఫారీ పర్యటనలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో రెండు మైలురాళ్లకు అడుగు దూరంలో నిలిచాడు. శనివారం జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో ధోని 42 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.

 పదివేల పరుగులకు 46 పరుగుల దూరంలో ధోని

పదివేల పరుగులకు 46 పరుగుల దూరంలో ధోని

ఈ నేపథ్యంలో తన వన్డే కెరీర్‌లో పదివేల పరుగులు చేయడానికి ఇంకా 46 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ధోని 9,954 వన్డే పరుగులతో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీని సాధిస్తే, పదివేల పరుగుల మైలురాయిని ధోని అందుకోనున్నాడు.

మరో ఐదు క్యాచ్‌లు పడితే మూడొందల క్యాచ్‌లు

మరో ఐదు క్యాచ్‌లు పడితే మూడొందల క్యాచ్‌లు

ఇక, రెండో మైలురాయి విషయానికి వస్తే వన్డేల్లో ఇప్పటి వరకు ధోని 295 క్యాచ్‌లను పట్టాడు. మరో ఐదు క్యాచ్‌లు పడితే మూడొందల క్యాచ్‌లు పట్టిన ఏకైక భారత వికెట్ కీపర్‌గా ధోని అరుదైన ఘనత సాధిస్తాడు. ఆరు వన్డేల సిరిస్‌లో మరో రెండు వన్డేలు మిగిలుండటంతో ఈ సఫారీ పర్యటనలోనే ధోని ఈ రెండు ఘనతలు సాధిస్తాడని అభిమానులు అనుకుంటున్నారు.

వన్డేల్లో ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 నాటౌట్‌

వన్డేల్లో ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 నాటౌట్‌

ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని బ్యాట్స్‌మన్‌గా 316 వన్డే మ్యాచ్‌లకుగాను 271 ఇన్నింగ్స్‌లు ఆడాడు. వన్డేల్లో ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 నాటౌట్‌. ఇక కీపర్‌గా 311 ఇన్నింగ్స్‌ల్లో 401 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు. ఇందులో 106 స్టంపింగ్స్‌ ఉన్నాయి. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 400 ఔట్లలో భాగస్వామి అయిన వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.

తొలి వికెట్ కీపర్‌గా ధోని రికార్డు

మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్‌ రెండో బంతికి దక్షిణాఫ్రికా కెప్టెన్‌ మర్క్రమ్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత అందుకున్నాడు. ఈ స్టంపౌట్‌తో ధోని వికెట్ల వెనకన ఉండి 400 మందిని పెవిలియన్‌కు పంపించిన ఘనత సాధించాడు. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఈ మార్కును చేరిన నాలుగో వికెట్‌ కీపర్‌ ధోని. అతనికి ముందు సంగక్కర (482), గిల్‌క్రిస్ట్‌ (472), బౌచర్‌ (424) ముందున్నారు.

Story first published: Monday, February 12, 2018, 18:55 [IST]
Other articles published on Feb 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+