Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2007లో నన్నే కెప్టెన్‌గా ఎందుకు ఎంచుకున్నారంటే: ధోని

MS Dhoni explains, despite being young why he was chosen to lead Team India in 2007 World T20

హైదరాబాద్: 2007లో జట్టులో తనకంటే సీనియర్లు ఉన్నప్పటికీ... తననే ఎందుకు కెప్టెన్ చేశారన్న విషయంపై మహేంద్ర సింగ్ ధోని 'ది ప్రింట్' పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు. 'అప్పట్లో కెప్టెన్‌ను ఎన్నుకునేందుకు జరిగిన చర్చలో నేను పాల్గొనలేదు. అయితే నా నిజాయితీ, మ్యాచ్‌ను అర్థం చేసుకునే తత్వమే నన్ను కెప్టెన్‌గా ఎన్నుకోవటంలో ఉపకరించిందని అనకుంటున్నా. మ్యాచ్‌ను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం' అని ధోని తెలిపాడు.

'అప్పటికి జట్టులోని కొత్త ఆటగాళ్లలో నేనొకడిని. కానీ ఎప్పుడైనా సీనియర్‌ ఆటగాడు మ్యాచ్‌పై నా అభిప్రాయం చెప్పమన్నప్పుడు నిర్భయంగా, నిస్సంకోచంగా నా మనసులో ఉన్నది చెప్పేవాడిని. అందుకే జట్టులో ఉన్న అందరితో నాకు సత్సంబంధాలుండేవి' అని ధోని వెల్లడించాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ జట్టుకు ధోని కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే.

అప్పడు ధోని వయసు 26 ఏళ్లు. అంతేకాదు చిన్న వయసులో తనకంటే పెద్ద వాళ్లతో ఆడేవాడినని అందుకే ఇప్పుడు బాగా ఆడుతున్నానేమో అని ధోని పేర్కొన్నాడు. 'మా కాలనీలో క్రికెట్‌ ఆడే పిల్లల్లో నేనొక్కడినే చిన్నవాడిని. మిగిలిన వాళ్లంతా కనీసం నాకన్నా ఐదారేళ్లు పెద్దవాళ్లు. వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడం వల్లే బాగా ఆడగలిగానేమో. ఎందుకంటే ఆట గురించి నాకంటే వాళ్లకే బాగా తెలుసు. వారితో ఆడడం నన్ను మెరుగైన ఆటగాడిగా మలిచింది' అని ధోని అన్నాడు.

2011 వరల్డ్ కప్ విజయం తన జీవితంలో మరిచిపోలేని ఘటన అని పేర్కొన్నాడు. '2011 ప్రపంచకప్‌ గెలవడమే క్రికెటర్‌గా నా కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలు. ఆ రోజు వాంఖడే స్టేడియంలో ఉన్న అభిమానులకు భారత్‌ ప్రపంచకప్‌ గెలువబోతోందని నాలుగైదు ఓవర్ల ముందే తెలిసిపోయింది. వందేమాతరం తదితర గీతాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. అలాంటి వాతావరణాన్ని ఎప్పటికీ సృష్టించలేం. ఏదో ఒకరోజు మళ్లీ చూస్తానని అనుకుంటున్నా' అని ధోని అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 9:49 [IST]
Other articles published on Nov 17, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+