Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయాలు: బోర్డర్ రికార్డును సమం చేసిన ధోనీ

హరారే: కొత్త కుర్రాళ్లతో కూడిన జట్టుతో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి విపత్కర పరిస్థితులు తప్పవన్న విశ్లేషకుల అంచనాలకు చెక్ పడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను రెండో వన్డేకే చేజిక్కించుకున్న ధోనీ సేన.. బుధవారం జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించి ప్రపంచ క్రికెట్ లో అరుదైన రికార్డును సాధించాడు.

బుధవారం నాటి వన్డే మ్యాచ్ విజయంతో 107 విజయాలను నమోదు పేరిట నమోదు చేసుకున్న ధోనీ.. ప్రపంచంలోనే అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డన్ సరసన చేరాడు. ఇక ఈ విషయంలో 165 విజయాలతో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

dhoni

178 అంతర్జాతీయ వన్డే మ్యచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించిన అలెన్ బోర్డర్.. 107 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపాడు. 1985 నుంచి 1994 వరకు సారథిగా వ్యవహరించాడు అలెన్ బోర్డర్. ఇతని సారథ్యంలో 67 మ్యాచ్ లు ఓడింది ఆస్ట్రేలియా.

కాగా, 2007-2016 మధ్య కాలంలో ధోనీ సారథ్యంలో టీమిండియా 195 మ్యాచులకు గానూ 107 మ్యాచుల్లో విజయం సాధించింది. 72 మ్యాచుల్లో ఓటమి పాలైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+