Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: నేను అప్పుడే రిటైర్ అయిపోయా.. ఏడాది తర్వాత ప్రకటించా.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ధోనీ!

గత వరల్డ్ కప్‌లో.. న్యూజిల్యాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌.. టీమిండియాను గెలిపించడానికి ఎంస్ ధోనీ ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. కానీ గప్తిల్ విసిరిన ఓ డైరెక్ట్ త్రో వల్ల రనౌట్‌ అయ్యాడు. ఆ రోజు వంద కోట్ల మంది భారత అభిమానుల గుండెలు బద్దలైన రోజది. అలా అవుటైనందుకు ధోనీ కూడా చాలా బాధ పడుతూ మైదానం వీడాడు. తాజాగా మరోసారి ఆ మ్యాచ్‌ను ధోనీ గుర్తుచేసుకున్నాడు.

తాజాగా ఈవెంట్లో పాల్గొన్న ధోనీ.. ఇంటర్నేషనల్ కెరీర్ ఆఖరి రోజుల గురించి మాట్లాడాడు. ఆ రోజులు ఎలా గడిచాయని ప్రశ్నించగా.. తన వరకు మాత్రం 2019లో న్యూజిల్యాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచే భారత్ కోసం ఆడిన ఆఖరి మ్యాచ్ అన్నాడు. మానసికంగా తను అలాగే ఫీలయ్యానని వెల్లడించాడు.

MS Dhoni emotional comments on his international retirement

'ఒక్కోసారి గెలవగలిగే మ్యాచ్ ఓడిపోయినప్పుడు, ఆ మ్యాచ్‌ను గెలిపించలేనప్పుడు, మనమేంటో మనకే మానసికంగా అర్థమైపోతుంది. ఇకపై మనం ఏం చేయాలనే దానిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. నాక్కూడా ఆ మ్యాచ్‌ తర్వాత అలాంటి ఫీలింగ్ కలిగింది. ఆ మ్యాచ్ ముగిసిన ఏడాదికి రిటైర్మెంట్ ప్రకటించాను' అని ధోనీ చెప్పుకొచ్చాడు.

'కానీ నా వరకు మాత్రం భారత్ కోసం నేను ఆడిన ఆఖరి మ్యాచ్ అదే. నేను ఆ రోజే రిటైర్ అయిపోయా' అని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. '10-12 ఏళ్లు దేశం కోసం ఆడి, ఆ ఆటతోనే గడిపి.. ఒక్కసారిగా ఇక మనం దేశం తరపున ఆడలేం అనే ఆలోచన చేయడమే చాలా భారంగా ఉంటుంది' అని చెప్పాడు.

'కానీ స్పోర్ట్స్‌లో వేలాది మంది మనలాగే దేశానికి ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటుంటారు. వాళ్లలో నేను కూడా ఒకడిని అంతే. కానీ ఒక్కసారి రిటైర్మెంట్ ప్రకటించామంటే దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని కోల్పోతాం. అందుకే రిటైర్మెంట్ అనేది చాలా ఎమోషనల్ డెసిషన్' అని ధోనీ చెప్పుకొచ్చాడు..

Story first published: Friday, October 27, 2023, 15:50 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+