ఫోటో వైరల్: తిరునెల్వేలిలో ట్రాక్టర్ నడిపిన ధోని

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం తమిళనాడులోని తిరునెల్వేలిలో సందడి చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో భాగంగా తిరునెల్వేలిలో ధోని పర్యటించాడు. ఈ సందర్భంగా ధోని ట్రాక్టర్ నడిపి అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం గుండారు జలపాతంలో జలకాలాడారు.
ఇక, టీఎన్‌పీఎల్ లీగ్‌లో భాగంగా తిరునెల్వేలిలో మధురై పాంథర్స్, కోవై కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముందు నిర్వహించిన టాస్ సమయంలోనూ ధోని అకస్మాత్తుగా స్డేడియంలో ప్రత్యక్షమవడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. మైదానమంతా కలియ తిరిగిన ధోని అభిమానులకు అభివాదం చేశాడు.
అనంతరం ధోని మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్ సీజన్‌లోగా తమిళం మాట్లాడటం నేర్చుకుంటానని ఫ్యాన్స్‌కు చెప్పారు. ప్రతి ఏడాది టీఎన్‌పీఎల్‌లో జరిగే కొన్ని మ్యాచ్‌లను వీక్షించేందుకు తప్పకుండా వస్తానని తెలిపారు. ఈ ఏడాది టోర్నీలో నేను చూసిన తొలి గేమ్ ఇదేనని ధోని వెల్లడించారు.
సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియాకప్‌లో ధోనీ మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకొని అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. ధోనిని చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications