'ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో ఆడాలనేది ధోని కల'

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆతడి స్నేహితుడు, రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ మేనేజర్ అరుణ్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన ధోనిని ఇటీవలే వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ల నుంచి ధోనిని తప్పించిన విషయం తెలిసిందే.

ధోని జట్టులో ఉంటాడా అనేది కూడా అనుమానంగా
దీంతో వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ వరకైనా ధోని జట్టులో ఉంటాడా అనేది కూడా అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో అరుణ్ పాండే గల్ఫ్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్యూలో వన్డే, టీ20ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవడానికి బలమైన కారణాలున్నాయని చెప్పుకొచ్చాడు.

కొత్త కెప్టెన్‌కి జట్టుపై పూర్తి పట్టు ఉండాలనే ఉద్దేశంతో
"వరల్డ్‌కప్ ప్రారంభమయ్యేలోపు కొత్త కెప్టెన్‌కి జట్టుపై పూర్తి పట్టు ఉండాలనే ఉద్దేశంతో, అతడు ప్రణాళికలు రూపొందించుకోవడానికి తగిన సమయం ఇవ్వాలనే కారణంతోనే కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్నాడు. కెప్టెన్సీ వదులుకున్నా మెంటర్‌గా విరాట్ కోహ్లికి సలహాలు ఇవ్వాలని భావించాడు, వచ్చే ప్రపంచకప్‌లో ఆడాలని కలలు కూడా కన్నాడు" అని చెప్పాడు.

ధోని అవసరం ఎంతైనా ఉంది
వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టుకి ధోని అవసరం ఎంతైనా ఉందని అరుణ్ పాండే తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యనటలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన మహేంద్ర సింగ్ ధోనీని పక్కకు పెట్టిన సెలెక్టర్లు టీ20 సిరీస్ కోసం రిషబ్ పంత్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల అనంతరం ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు టీ20ల సిరిస్‌లో ధోని ఆడనున్నాడు.

నవంబరు 21న ఇరు జట్ల మధ్య తొలి టీ20
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ నవంబరు 21న ప్రారంభం కానుంది. ఆ దేశ పర్యటన అనంతరం భారత్-న్యూజిలాండ్ మధ్య టోర్నీ జరగనుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications