ధోనీ చేసిన ఆ మంచి పనితో.. ఓ స్వచ్ఛంద సంస్థకు ఊహించని రీతిలో విరాళాలు!!

పుణే: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజూవారీ కూలీ చేసుకొనే వాళ్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు దొరకక నానా తిప్పలు పడుతున్నారు. అయితే వీరిని ఆదుకునేందుకు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే తన వంతు సాయం చేసారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా చేరాడు.

పేదలను ఆదుకునేందుకు:
పుణెలో ఇప్పటికే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాలన్ని నిర్భందంలో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు దొరకక చాలా మంది పేదవారు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇటువంటి వారిని ఆదుకొనేందుకే 'ముకుల్ అండ్ మాధవ్' అనే సంస్థ విరాళాలు సేకరించడం ప్రారంభించింది. కేట్టో అనే విరాళాలు సేకరించే వెబ్‌సైట్ ద్వారా వీరు ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. వచ్చిన విరాళాల ద్వారా కష్టాల్లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులు, ఆహారపదార్థాలు అందించాలనేదే ఈ సంస్థ లక్ష్యం.

లక్ష విరాళం:
'ముకుల్ అండ్ మాధవ్' సంస్థకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన వంతు సహాయం చేసాడు. ఇప్పటివరకూ ఆ ఫౌండేషన్‌కు ఎవరూ ఇవ్వనంత మొత్తాన్ని మహీ విరాళంగా అందించాడు. రూ.లక్ష కూలీల సంక్షేమం కోసం ధోనీ విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ధోనీ సతీమణి సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకొనేందుకు ప్రతీ ఒక్కరు తమ వంతు సహాయాన్ని అందించాలని కూడా ఆమె కోరింది.

రూ.12 లక్షలు విరాళాలు వచ్చాయి:
కరోనా కారణంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసేందుకు 12 లక్షల 50 వేల రూపాయిల విరాళాలు సేకరించాలని ముకుల్ అండ్ మాధవ్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ధోనీ రూ.లక్ష విరాళంగా ఇవ్వడంతో.. అది చూసిన చాలా మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. చాలా మంది డబ్బులు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకూ దాదాపు రూ.12 లక్షలు తమకు విరాళంగా అందాయని సదరు సంస్థ తెలిపింది. మరొక్క రోజులో టార్గెట్ ఆదుకుంటామని, వీలయినంత మరింత సాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications