న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మామూలు సైనికుడి లాగే ధోని... ప్రత్యేక రక్షణ కల్పించలేం'

Dhoni Will Be Protecting The Citizens, Needs No Protection : Army Chief Bipin Rawat || Oneindia
MS Dhoni doesn’t need to be protected, says Indian Army chief Bipin Rawat

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేకంగా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయడం లేదని, మామూలు సైనికుడికి ఎలాంటి సదుపాయాలు అందిస్తామో అతడికి కూడా అవే లభిస్తాయని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. అంతేకాదు దేశ రక్షణలో భాగమైన సైనికుడికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ధోని ప్రారంభమైన శిక్షణ

ధోని ప్రారంభమైన శిక్షణ

తన రెండు నెలల సైనిక శిక్షణను ధోని గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని బుధవారం బెటాలియన్‌తో కలిసి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు స్వీకరించాడు. ఈ సందర్భంగా బిపిన్‌ రావత్‌ ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ ధోనికి ట్రైనింగ్ ప్రారంభమైందని చెప్పారు.

106 టెరిటోరియల్ ఆర్మీలో చేరిన ధోని

106 టెరిటోరియల్ ఆర్మీలో చేరిన ధోని

"ధోని ట్రైనింగ్‌ ప్రారంభమైంది. 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరాడు. కశ్మీర్‌లో విక్టర్‌ ఫోర్స్ పేరిట నిర్వహించే యూనిట్‌లో ఈ బెటాలియన్ పని చేయనుండగా.. వారితో పాటే ధోని కూడా ఉండనున్నారు. కమ్యూనికేషన్‌, స్టాటిక్‌ రక్షణలో ఈ బెటాలియన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది" అని ఆర్మీ ఛీప్ బిపిన్ రావత్ అన్నారు.

ధోనికి ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేయడం లేదు

ధోనికి ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేయడం లేదు

"ఆ బెటిలియన్‌లోనే ధోని పని చేయడం అతడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ధోనికి ప్రత్యేకంగా వసతులు ఏర్పాటుచేయలేదు. మామూలు సైనికుడికి ఎలాంటి సదుపాయాలు అందిస్తామో ధోనికి కూడా అవే లభిస్తాయి. ఇక ధోని కోసం ప్రత్యేక రక్షణ కల్పించలేం. అతడే దేశానికి, ప్రజలకు రక్షణగా ఉంటాడు" అని ఆయన అన్నారు.

జులై 31 నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు

జులై 31 నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు

జులై 31 నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు. క‌శ్మీర్‌లో ఉన్న విక్ట‌ర్ ఫోర్స్‌తో ధోనీ క‌ల‌వ‌నున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్ డ్యూటీల‌ను ధోనీ నిర్వర్తించనున్నాడు.

Story first published: Friday, July 26, 2019, 19:06 [IST]
Other articles published on Jul 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X