
అభిమాని హెలికాఫ్టర్ షాట్:
ఎంఎస్ ధోనీ హెలికాఫ్టర్ షాట్‌ను అంతర్జాతీయ ఆటగాళ్లే కాకుండా చాలా మంది క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా ఎంఎస్ ధోనీ ఫాన్స్ ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఓ అభిమాని హెలికాఫ్టర్ షాట్ ఆడాడు. ఆ షాట్‌ను టెన్నిస్ బంతితో ఆడాడు. అంతేకాదు ఒంటిచేత్తో ఆడాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా కంట పడింది. ఇక మనోడు ఊకుంటాడా?. వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
గొప్ప హెలికాప్టర్ షాట్‌ను కనుకొన్నాం:
ఆకాష్ చోప్రా వీడియోను పోస్ట్ చేసి.. ఓ కాప్షన్ పెట్టి ఎంఎస్ ధోనీని పరోక్షంగా ప్రస్తావించాడు. ఇది అత్యుత్తమ హెలికాప్టర్ షాట్ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. 'గొప్ప హెలికాప్టర్ షాట్‌ను కనుగొన్నాం.. అంతర్జాతీయ క్రికెట్లోకి రావాలంటే కొంత సమయం వేచి ఉండాలి' అని రాసుకొచ్చాడు. ధోనీ కంటే బెటర్ హెలికాప్టర్ షాట్ ఇది అని పరోక్షంగా అన్నాడు. ఇది చూసిన ధోనీ అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. 'ఈ షాట్ అంతర్జాతీయ క్రికెట్లో ఆడితే సర్కిల్ లోపలే పడుతుంది' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'బంతి హైట్ వెళ్లింది తప్ప ప్రయోజనం ఏమీ లేదు' అని మరో అభిమాని అన్నాడు.

నన్ను క్షమించండి:
ఎంఎస్ ధోనీ అభిమానుల ఆగ్రహానికి ఆకాష్ చోప్రా గురవడం ఇది మొదటిసారి ఏం కాదు. ఇటీవల టీ20 ప్రపంచకప్ కోసం భారత్ జట్టుని అంచనా వేసిన ఆకాశ్ చోప్రా.. అందులో ధోనీకి ఛాన్స్ ఇవ్వకపోవడంతో అతని అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఫ్యాన్స్ దెబ్బకి అతను సోషల్ మీడియాకి రెండు రోజులు దూరంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ధోనీ ఎంపికని విస్మరించినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. 'కొందరు నన్ను, నా పిల్లలను ఇష్టమొచ్చిన విధంగా తిడుతున్నారు. దీంతో సోషల్ మీడియాకు కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన విషయాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి' అంటూ మహీ అభిమానులను ఆకాశ్ కోరాడు.

భారత్ తరఫున 10 టెస్టులు:
ఆకాశ్ చోప్రా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కేవలం ఒక ఏడాది మాత్రమే భారత్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన చోప్రా.. 10 టెస్టులాడి 23 సగటుతో 437 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఇక 2004లో కెరీర్‌ని ముగించిన చోప్రా.. కనీసం ఒక్క వన్డే కూడా ఆడలేదు. అనంతరం మ్యాచ్ కామెంటేటర్‌గా మాత్రం సుదీర్ఘకాలంగా విజయవంతంగా కొనసాగుతున్నాడు.


Click it and Unblock the Notifications












