Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'డొమెస్టిక్'లో 20 ఏళ్ల కేరళ స్పిన్నర్‌కు చిక్కిన ధోనీ

బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో మహేంద్ర సింగ్ ధోనీ (18) విఫలమైనా జార్ఖండ్ జట్టు కేరళ జట్టు పైన అయిదు వికెట్ల తేడాతో గెలిచింది. కేరళ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్య ఛేదనలో జార్ఖండ్ 47 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

సౌరభ్ తివారీ (87 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీతో జట్టు గెలుపులో కీలకమయ్యాడు. తొలుత రాహుల్ శుక్లా(3/47) ధాటికి కేరళ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది.

MS Dhoni dismissed cheaply by 20-year-old Kerala spinner

కాగా, మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటి వరకు ఈ ట్రోఫీలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ధోనీ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. జార్ఖండ్ ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడింది. తొలి మ్యాచులో 9, రెండో మ్యాచులో 44 పరుగులు చేసిన ధోనీ మూడో మ్యాచులో 18 పరుగులు చేశాడు.

31 బంతుల్లో ఒక ఫోర్ కొట్టి 18 పరుగులు చేశాడు. ధోనీ కేరళ బౌలర్ ధాటికి సులభంగా అవుటయ్యాడు. ధోనీ 20 ఏళ్ల కేరళ స్పిన్నర్ ఫాబిద్ అహ్మద్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధోనీని అవుట్ చేయగానే అహ్మద్‌ను సహచర ఆటగాళ్లు ప్రశంసించారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+