మిత్రులతో కలిసి ధోని భోజనం: ఛాయ్‌వాలా కూడా (ఫోటోలు)
హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన పాత స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాక మరింత సమయం దొరికింది.
ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. ట్రోఫీలో భాగంగా అదివారం ఛత్తీస్ గడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం ధోని చెలరేగి ఆడాడు. 107 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులతో 129 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు.

టీస్టాల్ యజమానితో కలిసి భోజనం చేసిన ధోని
ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం కోల్‌కతాలో తాను రైల్వే టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో స్నేహితులు, తన రూమ్మేట్, ఖరగ్‌పూర్‌లో తనకు పాలు అందించే టీస్టాల్ యజమానితో కలిసి భోజనం చేశాడు. నిజం చెప్పాలంటే ధోనికి కోల్ కతాతో సుదీర్ఘ అనుబంధం ఉంది.

ఖరగ్ పూర్ స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన ధోని
అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాకముందు ఖరగ్ పూర్ స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేశాడు. రైల్వేస్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్రస్థానం ఆరంభించిన ధోనీ కోల్‌కతాలోనే జూనియర్ క్రికెట్ ఆడాడు. రంజీలో 2001లో బిహార్ తరఫున తొలి సెంచరీని (114 నాటౌట్) కూడా ఇక్కడే చేశాడు.

భార్య సాక్షిని కలిసిందీ కోల్‌కతాలోనే
అంతేకాదు ధోని భార్య సాక్షిని కలిసిందీ కోల్‌కతాలోనే కావడం విశేషం. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనికి ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు. సత్యప్రకాశ్ సింగ్ అనే స్నేహితుడు రైల్వే ప్లేయర్ నుంచి టీమిండియాకు ఆడిన ధోని ఎదుగుదల మొత్తాన్ని వీక్షించాడు.

కోల్‌కతాతో సుదీర్ఘ అనుబంధం
ఇక ఖరగ్ పూర్‌లోని ఛాయ్ వాలా థామస్‌ను చూసిన వెంటనే గుర్తు పట్టిన ధోని అతడితో కలిసి కాసేపు ముచ్చటించాడు కూడా. మ్యాచ్ ముగిసిన తర్వాత తన మిత్రులను జార్ఖండ్ జట్టు బస చేసిన హోటల్‌కు పిలిపించుకుని వారితో కలిసి భోజనం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications