Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్ ఫేర్‌వెల్‌కు ధోని అన్ని విధాలా అర్హుడు: సునీల్ గవాస్కర్

MS Dhoni deserves a World Cup farewell: Sunil Gavaskar to India Today

హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో వికెట్ కీపర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అవకాశం ఇస్తే బాగుంటుందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జనవరిలో జరిగే వన్డే సిరిస్‌కు సెలక్టర్లు ధోనిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ధోనికి స్థానం ఉంటుందా?

ధోనికి స్థానం ఉంటుందా?

దీంతో వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో సైతం ధోనికి స్థానం ఉంటుందా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ నేఫథ్యంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "యువ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తే అతడిన ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌కు ఎంపిక చేసుకోవచ్చు. బ్యాటింగ్‌లో తన వైవిధ్యాన్ని చూపిస్తాడు" అని అన్నాడు.

కోహ్లీకి ధోనీ ఎంతో ఉపయోగపడతాడు

కోహ్లీకి ధోనీ ఎంతో ఉపయోగపడతాడు

"అయితే, వికెట్‌ కీపర్‌ స్థానాన్ని ధోనిని ఎంపిక చేస్తే బాగుంటుంది. ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ధోనీ ఎంతో ఉపయోగపడతాడు. ధోనీ వ్యూహాలు, అతడి సూచనలు టీమిండియాకు చాలా అవసరం. ధోనీకి 2011లో ప్రపంచకప్‌ గెలిచిన అనుభవం ఉంది" అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

 ధోనీకి అర్హత ఉండే ప్రతి మ్యాచ్‌లో

ధోనీకి అర్హత ఉండే ప్రతి మ్యాచ్‌లో

"ఒక్క ప్రపంచకప్‌లోనే కాదు ధోనీకి అర్హత ఉండే ప్రతి మ్యాచ్‌లో అతడికి అవకాశం ఇవ్వాలి. ఇక టెస్టుల విషయానికొస్తే రాహుల్‌ను ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఐపీఎల్‌లో రాహుల్‌ మంచి ఆటగాడు. అతడిని టీ20ల్లో ఆడించవచ్చు కదా. జట్టు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆసీస్‌పై గెలవడం పెద్ద కష్టమేం కాదు" అని గవాస్కర్ అన్నాడు.

మూడు నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి

మూడు నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వచ్చే ఏడాది జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం 16 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. పేలవ ఫామ్ కారణంగా టీ20 జట్టులో చోటు కోల్పోయిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి మళ్లీ వన్డే, టీ20 జట్టులో భారత సెలక్టర్లు చోటు కల్పించారు. దీంతో మూడు నెలల తర్వాత మళ్లీ భారత్ తరఫున ధోనీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

Story first published: Wednesday, December 26, 2018, 15:17 [IST]
Other articles published on Dec 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+