భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ అభిమానులతో కలిసి ముచ్చటించాడు. ఈ క్రమంలో వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తన కెరీర్‌లో అత్యంత ఎక్కువగా బాధపెట్టిన క్షణాలు గురించి వివరించాడు.
2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ ఓటమిపాలైన క్షణంలో తన గుండె బద్దలైందని ధోనీ పేర్కొన్నాడు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపాడు. అదే చివరి వరల్డ్ కప్ అని తనకి ముందు తెలుసని కానీ, అదే చివరి మ్యాచ్ అవుతుందని ఊహించలేదని అన్నాడు. ధోనీ 2019 జులై 9న భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. కానీ 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

''2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి చాలా బాధాకరం. అదే నా చివరి వరల్డ్ కప్ అని తెలుసు. కాబట్టి విజయంతో ముగిస్తే ఎంతో బాగుండేది. అది గుండె బద్దలైన క్షణం. కాన్నీ ఆ ఫలితాన్నిఅంగీకరించి, ముందుకు సాగాలి. దానికి కొంత సమయం పడుతుంది. వరల్డ్ కప్ తర్వాత నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. కాబట్టి నాకు చాలా సమయం లభించింది (నవ్వుతూ). అయితే ఆ ఓటమి హృదయ విదారకంగా ఉంది. దాని నుంచి కోలుకోవడానికి అత్యుత్తమంగా ప్రయత్నించాలి. కానీ దాన్ని చేయలేకపోయా'' అని ధోనీ అన్నాడు.
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోనీ వచ్చే సీజన్ ఆడుతాడా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోనీని సీఎస్కే రిటైన్ చేసుకుంటుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ధోనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.