For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా?: పగలబడి నవ్విన సాక్షి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ధోని డ్యాన్స్ చేయడాన్ని చూసిన ఆయన భార్య సాక్షి పగలబడి నవ్వడం విశేషం.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ధోని డ్యాన్స్ చేయడాన్ని చూసిన ఆయన భార్య సాక్షి పగలబడి నవ్వడం విశేషం. న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ముగియడంతో ఆటగాళ్లంతా కుటుంబ సభ్యులతో గడిపేందుకు కాస్తంత సమయం లభించింది.

దీంతో మహేంద్ర సింగ్ ధోని తన భార్య సాక్షితో సరదాగా గడిపిన వీడియోని క్రికెట్ షాట్స్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో బాలీవుడ్‌ చిత్రం 'దేశీ బాయ్స్‌'లోని 'ఝగ్‌ మార్‌ కే' పాటకు స్టెప్పులేస్తూ కనిపించాడు. ధోని చేసిన డ్యాన్స్‌ని చూసి సాక్షి నవ్వుతూనే కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే న్యూజిలాండ్ సిరిస్ అనంతరం టీమిండియా... శ్రీలంకతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరిస్ కోసం శ్రీలంక ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 16న కోల్ కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+