Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింగర్‌గా మారిన ధోనీ.. పాట చూడటానికి ధైర్యం కావాలి (వీడియో)!!

#WatchVideo : MS Dhoni Sings 'Jab Koi Bat Bigad Jaye' ! || Oneindia Telugu
MS Dhoni croons iconic song Jab Koi Baat Bigad Jaye


ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ మరోకొత్త అవతారం ఎత్తాడు. క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన ధోనీ సింగర్‌గా మారాడు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన ఓ కార్యక్రమంలో స్నేహితుడితో కలిసి పాట పాడాడు. దీంతో త‌న‌లో మ‌రో టాలెంట్ కూడా దాగి ఉంద‌ని జార్ఖండ్ డైనమేట్ నిరూపించాడు.
 సింగర్‌గా మారిన ధోనీ:

సింగర్‌గా మారిన ధోనీ:

ప్రపంచకప్‌ 2019 సెమీస్‌ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పూర్తి సమయాన్ని కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నాడు. ముఖ్యంగా కూతురు జీవాతో కలిసి సందడి చేసాడు. బర్త్‌డే వేడుకలలో కూడా పాల్గొన్నాడు. తాజాగా కుటుంబంతో కలిసి ధోనీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో స్నేహితుడితో కలిసి గొంతు కలిపాడు. బాలీవుడ్‌ చిత్రం జుర్మ్‌లో 'జబ్‌ కోయ్‌ బాత్‌ బిగాద్‌ జయా' పాటను మహీ పాడి అక్కడ ఉన్న అందరిని ఆశ్చర్యపరిచాడు.

నన్ను చంపొద్దు:

ఈ వీడియోను ధోనీ స్నేహితురాలు, టెలివిజ‌న్ న‌టి ప్రీత్ సిమోస్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'హెచ్చరిక. ఇది చూడటానికి మీకు ధైర్యం కావాలి. మహీకి అద్భుతమైన ప్రతిభ ఉంది. మహీ.. ఈ వీడియో పోస్ట్‌ చేసినందుకు నన్ను చంపొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో షేర్‌ చేయాల్సి వచ్చింది' అని పోస్ట్ చేశారు. వీడియో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాత్కాలిక విరామం:

తాత్కాలిక విరామం:

ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌ అనంతరం తాత్కాలిక విరామం తీసుకున్న ధోనీ.. కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే ప్రపంచకప్‌ అనంతరం ధోనీ రిటైర్మెంట్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. చివరకు తన రిటైర్మెంట్‌పై మహీ స్పందించాడు. పునరాగమనం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...'జనవరి వరకు నన్ను ఏం అడగొద్దు' అని చెప్పాడు.

 మళ్లీ బ్యాట్ పట్టిన మహీ:

మళ్లీ బ్యాట్ పట్టిన మహీ:

కొన్ని రోజుల క్రితం మహీ మళ్లీ బ్యాట్ పట్టాడు. మైదానంలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. కఠోర సాధన చేస్తూ శ్రమిస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్నాడని సమాచారం తెలుస్తోంది. మహీ రిటైర్మెంట్‌పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఓ విలేఖరి ప్రశ్నించగా .. 'దయచేసి నన్ను ఏమి అడగొద్దు. ఆ విషయాన్ని ధోనీనే అడగండి' అని సమాధానం ఇచ్చాడు.

Story first published: Thursday, December 5, 2019, 14:31 [IST]
Other articles published on Dec 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+