న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSKvsSRH: క్రెడిట్ అంతా వాళ్లకే ఇచ్చేసిన ధోనీ

MS Dhoni Credits Chennais Lower Order After Nervy Win Over SunRisers Hyderabad

హైదరాబాద్: ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టును ఓటమితో వెనక్కి నెట్టింది చెన్నై. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై 140పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒకానొక దశలో వరుస వికెట్లు కోల్పోయి.. పరుగులు రాబట్టడం భారంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో క్రీజులో నిలదొక్కుకుని బాధ్యతనంతా తన భుజాలపై నడిపించాడు డుప్లెసిస్.

ఘనతని డుప్లెసిస్‌తో మరికొందరికి సైతం

ఘనతని డుప్లెసిస్‌తో మరికొందరికి సైతం

చివరి వరకూ ఆడి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. ఆ విజయానందంలో మునిగిన చెన్నై జట్టు సంబరాలు చేసుకుంటుండగా కెప్టెన్.. ధోనీ ఆ ఘనతని డుప్లెసిస్‌తో పాటు మరికొందరికి సైతం ఆపాదిస్తున్నాడు.

అలాంటి పరిస్థితులు లేకుంటే అంతా విరుద్ధంగా:

అలాంటి పరిస్థితులు లేకుంటే అంతా విరుద్ధంగా:

'చాలా సంవత్సరాలుగా జట్టు తరపున ఆడుతున్న ప్రతి ఒక్కరూ బాగా ఆడారు. అసలు ఈ విజయానికి కారణం డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొనే ఆహ్లాదకరమైన వాతావరణమే వారిని తీవ్రమైన ఒత్తిడిలో కూడా ఇంతటి చక్కటి ఆటతీరు ప్రదర్శించేలా చేసింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక లేకుంటే అంతా విరుద్ధంగా ఉండేది. డుప్లెసిస్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించడానికి గల కారణం కూడా ఇదే.' అని పేర్కొన్నాడు.

ఇంకా 20పరుగులు వరకూ చేయాల్సింది

ఇంకా 20పరుగులు వరకూ చేయాల్సింది

గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్‌లో చక్కటి జోడీని పొందగలిగాం. లీగ్ ఆరంభం నుంచి బౌలర్లను మారుస్తూ ప్రయోగాలు చేస్తూనే వచ్చాం.' అని ధోనీ వెల్లడించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అతి చిన్న 140పరుగుల లక్ష్యాన్ని లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు చక్కగా ఆడగలిగారు. దీనిపై హైదరాబాద్ జట్టు కెప్టెన్ మాట్లాడుతూ.. 'ఇది లీగ్‌లోనే చక్కటి గేమ్. ఈ మైదానం కేవలం 140పరుగులు మాత్రమే చేసేది కాదు. ఇంకా 20పరుగులు వరకూ చేయాల్సింది' అని పేర్కొన్నాడు.

హైదరాబాద్‌పై చెన్నై అద్భుత విజయం:

హైదరాబాద్‌పై చెన్నై అద్భుత విజయం:

మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్లేఆఫ్ రేసులో చెన్నై, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139పరుగులు చేసింది. చేధనకు దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంలో డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు.

Story first published: Wednesday, May 23, 2018, 11:14 [IST]
Other articles published on May 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X