Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs CSK: మ్యాచ్ ఓడినా.. చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని

RCB vs CSK: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆర్సీబీ జట్టు 50 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా ఎంఎస్ ధోని నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ధోని కంటే ముందు డేవిడ్ వార్నర్ ఆర్సీబీపై 55 సిక్సర్లు కొట్టాడు. ఎంఎస్ ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంఎస్ ధోనికి గొప్ప రికార్డు ఉంది. ఎంఎస్ ధోని ఇప్పటివరకు ఆర్సీబీతో 35 మ్యాచ్‌లు ఆడి 906 పరుగులు చేశాడు. ఆర్సీబీపై ఎంఎస్ ధోని నాలుగు అర్థసెంచరీలు కూడా బాదాడు.

ఐపీఎల్‌లో ఆర్సీబీపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
డేవిడ్ వార్నర్-55 సిక్సర్లు
ఎంఎస్ ధోని - 50 సిక్సర్లు
కేఎల్ రాహుల్ - 43 సిక్సర్లు
ఆండ్రీ రస్సెల్ - 38 సిక్సర్లు
రోహిత్ శర్మ - 38 సిక్సర్లు

MS Dhoni Creates History in RCB vs CSK Match Despite Losing

మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఎంఎస్ ధోని ఇక్కడ 14 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 500 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ స్టేడియంలో ధోని ఆర్సీబీపై శనివారం జరిగిన మ్యాచ్‌లో 12 పరుగులు చేసి ఇక్కడ 500 పరుగులు పూర్తి చేసిన మరో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ ఎంఎస్ ధోని పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జేకబ్ బేతెల్(55), విరాట్ కోహ్లీ(62), రొమారయో షెపర్డ్(53) అద్భుతంగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో మతీషా పతిరానా 3 వికెట్లు పడగొట్టగా, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నాడు. ఖలీల్ వేసిన 19వ ఓవర్లో రొమారియో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు , 2 ఫోర్లు సహా 33 పరుగులు సమర్పించుకున్నాడు.

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదన చెన్నై సూపర్ కింగ్స్.. చివరి ఓవర్ వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుష్ మాత్రే(94), రవీంద్ర జడేజా(77) సీఎస్కేను గెలిపించేందుకు పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. సీఎస్కే చివర్ ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, కృనాల్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Sunday, May 4, 2025, 13:40 [IST]
Other articles published on May 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+