న్యూఢిల్లీ: భారత క్రికెట్ వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అనుసరించారు. ఇటీవల రజనీకాంత్ నటించిన కబాలి సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. చాలామంది రజినీ స్టైల్‌ను అనుకరించే ప్రయత్నం చేశారు.
ఆ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా చేరిపోయారు. కబాలీ సినిమాలో రజినీకాంత్ కూర్చుండే స్టయిల్‌లో ధోనీ కూడా కూర్చొని.. 'ఒకే ఒక్కడు తలైవార్ ఫోజు కాపీ కొట్టడానికి ప్రయత్నం చేశాను' అని సామాజిక అనుసంధాన వేదికలో పోస్ట్ చేశాడు. దానిని షేర్ చేసుకున్నాడు.
రజినీకాంత్ అంటేనే స్టయిల్. స్టయిల్ అంటే రజినీకాంత్. అలాంటి రజినీకాంత్ స్టయిల్‌ను పాలో అయ్యేందుకు చాలామంది ఉబలాటపడుతుంటారు. ఇప్పుడు ధోనీ కూడా ఆ జాబితాలో చేరడం గమనార్హం. ధోనీ తన పోస్ట్ ద్వారా తాను రజనీకాంత్ అభిమానిని అని చెప్పకనే చెప్పారు.