
కెప్టెన్‌గా ధోని మూడు సార్లు
2010, 2013, 2015లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ ఫైనల్‌లో ధోని ముంబై జట్టును ఎదుర్కొన్నాడు. 2010లో ముంబైపై విజయం సాధించినప్పటికీ.. 2013, 2015లలో ఓటమిపాలైంది. పదో సీజన్‌లో పూణె జట్టు తరుపున ఆడిన ధోని ముంబైతో తలపడ్డాడు.

ధోని అరుదైన రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో పైనల్ ఆడటంతో ధోని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఏడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. మొత్తం ఏడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచుల్లో (ఆరుసార్లు చెన్నై తరఫున, ఒకసారి పుణె తరఫున) ధోని ఆడాడు.

అత్యధిక ఐపీఎల్ ఫైనల్ మ్యాచులు
దీంతో పాటు అత్యధిక ఐపీఎల్ ఫైనల్ మ్యాచులు కోల్పోయిన ఆటగాడిగా కూడా ధోని రికార్డుని సొంతం చేసుకున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ఆరోపణలతో చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లను సస్పెండ్ చేయడంతో ధోనిని పూణె జట్టు వేలంలో దక్కించుకుంది.

పదో సీజన్‌లో రాణించని ధోని
అయితే ఐపీఎల్ పదో సీజన్‌లో ధోని బ్యాట్‌తో పెద్దగా రాణించలేదు. కానీ వికెట కీపింగ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 100 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ధోనికి ముందు దినేశ్ కార్తీక్ ఈ రికార్డుని సాధించాడు.

క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో 26 బంతుల్లో 40 పరుగులు
కాగా, పదో సీజన్‌లో క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబైపై 26 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు ధోని అద్భుతమైన విజయాన్ని అందించాడు. అలాగే, సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 34 బంతుల్లో 61 పరుగులు చేసి లీగ్ దశలో జట్టును గెలిపించాడు.

ఎనిమిది సీజన్ల పాటు చెన్నైకి కెప్టెన్‌గా ధోని
ఐపీఎల్‌లో ఎనిమిది సీజన్ల పాటు ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత ధోనిని పూణె ప్రాంచైజీ కొనుగోలు చేయడంతో పాటు 2016 సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే పదో సీజన్ ప్రారంభానికి ముందు ధోనిని తప్పించి అతడి స్దానంలో కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను నియమించింది.


Click it and Unblock the Notifications











