#15YearsofDhonism: వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్‌కు సోషల్ మీడియా ట్రిబ్యూట్

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని. టీమిండియాకు రెండు ప్రపంచ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. అభిమానులు ముద్దుగా 'మహీ' అని పిలుచుకుంటారు. అలాంటి ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ధోనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజున(డిసెంబర్ 23, 2004)బంగ్లాదేశ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన తొలి మ్యాచ్‌లో ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత తన అద్భుతమైన ఆటతీరుతో జట్టులో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు కెప్టెన్‌గా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా
అన్ని ఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందిన ధోని 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాలో ఓడించింది. ఇక, 2011లో సొంతగడ్డపై ధోని నాయకత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.

2011 వరల్డ్‌కప్ పైనల్లో
ముఖ్యంగా వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోని బాదిన విన్నింగ్స్ సిక్స ప్రతి భారత అభిమానికి ఇప్పటికీ గుర్తే. ఆ తర్వాత 2013లో ధోని నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. ఇలా, ధోని నాయకత్వంలోని టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది.

ధోనికి చోటు దక్కలేదు
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, వెస్టిండిస్ జట్లతో సిరిస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications