
వేర్వేరు కెప్టెన్ల ఫార్మ్‌లాపై ధోని వ్యాఖ్యలు
వేర్వేరు కెప్టెన్ల నియామకంపై 2017లో ధోని ఏమన్నాడంటే భారత్ జట్టుకు భిన్నమైన ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లు ఉండే ఫార్మాలా వర్కూట్ కాదని చెప్పుకొచ్చాడు. టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కలిపి ఒకే కెప్టెన్ ఉండడమే ఉత్తమమం అని ధోని ఆ రోజు అభిప్రాయపడ్డాడు. మిగిలిన జట్ల మాదిరిగా భారత జట్టుకు వేర్వేరు కెప్టెన్ల ఫార్మాలా వర్కౌట్ కాదని తేల్చి చెప్పాడు.
అప్పట్లో ధోని 2014లో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతోపాటు ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. అప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఓ మ్యాచ్‌కు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ధోని తప్పుకోవడంతో కోహ్లీ టెస్టు పగ్గాలు అందుకున్నాడు. ఆ తర్వాత ధోని కొంత కాలం వన్డే, టీ20లకు కెప్టెన్‌గా కొనసాగాడు.

పూర్తిగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని
విరాట్ కోహ్లీ టెస్టులకు కెప్టెన్ అయ్యాక తాను వన్డే, టీ20 లకు కెప్టెన్‌గా కొనసాగుతున్న సమయంలో తన మనసులో టీమిండియాకు భిన్న కెప్టెన్ల ఫార్ములా వర్కౌట్ కాదని ఎప్పుడూ ఉండేదని చెప్పుకొచ్చాడు. కానీ కోహ్లీకి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ కూడా చేయడానికి కొంత సమయం కావాలని అనుకున్నానని చెప్పాడు. కానీ త్వరలోనే ఆ సమయం వచ్చిందని చెప్పాడు.
దీంతో కోహ్లీకి పూర్తి కెప్టెన్సీ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావించానని, బీసీసీఐకి కూడా ఇదే చెప్పానని తెలిపాడు. ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకోని విరాట్ కోహ్లీకి అప్పగించినట్లు ఆనాడు మీడియా సమయంలో ధోని చెప్పాడు. ఆ తర్వాత శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ దేశాలలో కోహ్లీ సిరీస్‌లు కూడా గెలిచాడని గుర్తు చేశాడు.

వైరల్ చేస్తున్న ధోని ఫ్యాన్స్
ధోని ఆ రోజు చెప్పిన వ్యాఖ్యలను తాజాగా అతని ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ధోని చెప్పిన వ్యాఖ్యలను బీసీసీఐ కానీ, కోహ్లీ కానీ సీరియస్‌గా తీసుకోని ఉంటే జట్టుకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని మహీ అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications












