For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు తాత్కాలిక విరామం.. ఫామ్‌హౌజ్‌లో స్నేహితులతో ధోనీ చిల్‌!!

MS Dhoni Enjoys Time With Friends In Ranchi,Photos Viral ! || Oneindia Telugu
MS Dhoni celebrating the birthday of his childhood friend Seemant Lohani at his farmhouse in Ranchi

రాంచీ: చివరిసారిగా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ మైదానంలోకి దిగి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం భారత ఆర్మీలో పనిచేయాలని రెండు నెలలు క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా రెండు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతకు ధోనీ తిరిగి టీమిండియాకు ఆడతాడా లేడా అనే స్పష్టత లేదు.

స్నేహితులతో ఫామ్‌హౌజ్‌లో

స్నేహితులతో ఫామ్‌హౌజ్‌లో

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెలెక్టర్లకు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏం చెప్పాడో తెలియదు కానీ.. ఎవరిని అడిగినా ధోనీ రిటైర్మెంట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ తాత్కాలిక విరామంను ధోనీ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా కూతురు జీవాతో. ఆదివారం రాంచీకి దగ్గరల్లోని తన ఫామ్‌హౌజ్‌లో చిన్ననాటి స్నేహితులతో కలిసి ధోనీ చిల్‌ అయ్యాడు.

స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్

స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్

చిన్ననాటి స్నేహితుడు లోహానీ బర్త్‌డే వేడుకలను ధోనీ తన ఫామ్‌హౌజ్‌లో ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకులో ధోనీ స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. జీవా కూడా సందడి చేసింది. ధోనీ కేక్ కట్ చేసి లోహానీకి రుద్దాడు. అనంతరం జీవాతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అయ్యాయి. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు.

నిసాన్ జోంగాలో చక్కర్లు

నిసాన్ జోంగాలో చక్కర్లు

అంతకుముందు తన ఇంట్లోని కుక్కలతో సరదగా ఆడుకోవడం, జీవా ధోనితో కలసి అల్లరి చేయడం వంటి వీడియోలను ధోనీ షేర్‌ చేసిన విషయం తెలిసిందే. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలతో కూడా తన నివాసంలో సరదా సమయం గడిపాడు. ధోనీ.. తాను ఇటీవల కొనుగోలు చేసిన నిసాన్ జోంగాలో చక్కర్లు కొట్టాడు. రాంచీ వేదికగా ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా మధ్య ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియానికి ఈ వాహనంలోనే ధోనీ వచ్చిన విషయం తెలిసిందే.

రీఎంట్రీ వచ్చే ఏడాదే

రీఎంట్రీ వచ్చే ఏడాదే

విశ్రాంతి కారణంగా ధోనీ వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు దూరమయ్యాడు. అంతేకాదు డిసెంబరులో వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌లోనూ ఈ మాజీ కెప్టెన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో.. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే సిరీస్‌‌లో మళ్లీ ధోనీ రీఎంట్రీ ఇచ్చే అవకాశముందని సమాచారం తెలుస్తోంది.

Story first published: Monday, November 11, 2019, 13:50 [IST]
Other articles published on Nov 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+