Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విద్యార్థులతో బాలల దినోత్సవాన్ని జరుపుకున్న ధోనీ!!

MS Dhoni Spotted With 'Balidaan Badge' During Children's Day Celebrations In Ranchi || Oneindia
MS Dhoni celebrates Childrens Day with students in Ranchi

రాంచీ: భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్‌ దేశం గురువారం ఘన నివాళి అర్పించింది. చిన్న పిల్లలంటే అమితంగా ఇష్టపడే నెహ్రూ.. వారికి 'చాచా నెహ్రూ' గా మారిపోయారు. అందుకే దేశం మొత్తం ఆయన పుట్టిన రోజు నవంబరు 14న 'బాలల దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. గురువారం భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. నెహ్రూకు నివాళులర్పించారు.

విద్యార్థులతో బాలల దినోత్సవం:

విద్యార్థులతో బాలల దినోత్సవం:

క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న ధోనీ రాంచీలో పలువురు పిల్లలతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నాడు. వారితో కలిసి సరదా సమయం గడిపి.. ఈ బాలల దినోత్సవంను అక్కడి పిల్లలకు ఎప్పటికి గుర్తుండిపోయేలా చేశాడు. అంతేకాదు జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో విద్యార్థులకు సంతకం చేసిన బ్యాట్లను కూడా అందించాడు.

ఆర్మీపై ప్రేమ:

ఆర్మీపై ప్రేమ:

సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అయిన ధోనీ.. బాలల దినోత్సవం సందర్భంగా మరోసారి భారత ఆర్మీపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. గురువారం జరిగిన కార్యక్రమానికి ధోనీ తన టోపీ మరియు టీ షర్టుపై 'బలిదాన్ బ్యాడ్జ్' లోగో వేసుకున్నాడు. దీంతో అక్కడి యువ అభిమానులను ప్రోత్సహించాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

క్రికెట్‌కు తాత్కాలిక విరామం:

క్రికెట్‌కు తాత్కాలిక విరామం:

చివరిసారిగా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఆడిన ధోనీ మైదానంలోకి దిగి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం భారత ఆర్మీలో పనిచేయాలని రెండు నెలలు క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా రెండు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతకు ధోనీ తిరిగి టీమిండియాకు ఆడతాడా లేడా అనే స్పష్టత లేదు.

స్నేహితులతో ధోనీ చిల్‌:

స్నేహితులతో ధోనీ చిల్‌:

ఈ తాత్కాలిక విరామంను ధోనీ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా కూతురు జీవాతో. గత ఆదివారం రాంచీకి దగ్గరల్లోని తన ఫామ్‌హౌజ్‌లో చిన్ననాటి స్నేహితులతో కలిసి ధోనీ చిల్‌ అయ్యాడు. చిన్ననాటి స్నేహితుడు లోహానీ బర్త్‌డే వేడుకలను ధోనీ తన ఫామ్‌హౌజ్‌లో ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకులో ధోనీ స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. జీవా కూడా సందడి చేసింది. ధోనీ కేక్ కట్ చేసి లోహానీకి రుద్దాడు. అనంతరం జీవాతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేసాడు.

Story first published: Friday, November 15, 2019, 14:14 [IST]
Other articles published on Nov 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+